Recent Posts

ఢిల్లీ కోర్టు ఆవరణలో కాల్పులు-ముగ్గురు మృతి

అమరావతి: ఢిల్లీ కోర్టు ఆవరణలో  ఓ గ్యాంగ్‌ లాయర్‌ దుస్తుల్లో వచ్చి కాల్పులకు పాల్పడటంతో నలుగురు మృతి చెందారు..ఢిల్లీలోని రోహిణి కోర్టు రూమ్‌ 207లో ఈ దారుణం చోటుచేసుకుంది..రెండు గ్యాంగుల మధ్య ఏర్పడిని వివాదం కాల్పులకు దారి తీసింది.లాయర్‌ దుస్తుల్లో వచ్చిన సునీల్‌ గ్యాంగ్‌ కాల్పులకు పాల్పడింది.ఈ ఘటనలో మరో గ్యాంగ్‌ స్టర్‌ జితేంద్ర మృతి చెందాడు..ఓ కేసు విషయంలో గ్యాంగ్‌ స్టర్‌ జితేంద్ర కోర్టు రాగా లాయర్‌ దుస్తులు వచ్చిన కొంతమంది కాల్పులకు తెగబడ్డారు..కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్‌ జితేంద్రతోపాటు మరో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. కోర్టు ఆవరణంలోనే ఇరు గ్యాంగ్‌లు రెచ్చిపోయి కాల్పులు జరుపుకున్నాయి. కొంతకాలంగా సునీల్‌ గ్యాంగ్‌-జితేంద్ర గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది..ఈ క్రమంలోనే జితేంద్ర టార్గెట్‌ చేసుకున్న సునీల్‌ గ్యాంగ్‌.. కోర్టు ఆవరణలోనే కాల్పులకు దిగింది.జితేంద్ర గోగి అలియాస్‌ దాదా మోస్గ్‌ వాంటెడ్‌ క్రిమినల్‌.  2016లో పోలీస్‌ కస్టడీ నుంచి జితేంద్ర గోగి పరారీ అయ్యాడు..జితేంద్రపై రూ. 4 లక్షల రివార్డు ఉంది..ఇప్పటికే ఇతనిపై 12 దోపిడీ, హత్య కేసులున్నాయి. కంట్రోల్‌ ఆఫ్‌ ఆర్గనైజ్‌డ్‌ క్రైమ్‌ యాక్ట్‌ కింద కూడా జితేంద్రగోగిపై కేసు నమోదైంది. 

Spread the love