Recent Posts

క్రీడలలో ఉత్తమ ప్రతిభ చూపిన వారు, ప్రభుత్వ ఉద్యోగాలు సాదిస్తున్నారు-రోజా

వివిధ పోటీల ఫలితాల..

తిరుపతి:  క్రీడలతోనే ఆరోగ్యం ఉంటుందని, క్రీడలలో ఉత్తమ ప్రతిభ చూపిన వారు, ప్రభుత్వ ఉద్యోగాలు సాదిస్తున్నారని,,జాతీయ క్రీడలు తిరుపతిలో నిర్వహించడం గర్వించదగ్గ విషయమని నగరి శాసన ఎమ్మేల్యే రోజా అన్నారు. తిరుపతి ఇందిరా మైదానంలో ఈ నెల 5న ప్రారంభమై 9 వరకు జరుగుతున్న జాతీయ మహిళ, పురుషుల ఆహ్వాన కబడ్డీ పోటిలలో భాగంగా మూడవ రోజు శుక్రవారం అమె పోటీలను తిలకించారు.ఈ సందర్బంలో ఎమ్మేల్యే మాట్లాడుతూ 43 జట్లు 750 మంది క్రీడాకారులు ఆడడం గొప్ప విషయమని,కబడ్డీ జాతీయ క్రీడ అని తిరుపతి లోనే నిర్వహించే కబడ్డీ కి మరింత ఆదరణ పెరుగుతుందన్నారు. ప్రతి ప్రభుత్వ ప్రైవేటు పాటశాల, కళాశాలలో ప్రతి విద్యార్ది క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని అన్నారు.

పురుషుల విభాగంలో:- పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్  జట్ల  మధ్య జరిగిన పోటీలో ఆంధ్రప్రదేశ్ 51 – 28 స్కోరుతో సునాయాసంగా గెలిచింది. ఈ జట్టులో ఉత్తమ క్రీడాకారుడుగా తేజ, మోబేస్వర్ వల్లి  (ఆంధ్రప్రదేశ్) ఎంపికయ్యారు. హోన్నప్ప అకాడమి జట్టుపై హర్యానా జట్టు 62 -35 స్కోరుతో ఏక పక్షంగా విజయం సాదించింది. ఈ పోటీలో ఉత్తమ క్రీడాకారుడిగా కరంబి టాగూర్ (హర్యానా) ఎన్నికయ్యాడు. అర్ట్లరీ హైదరాబాద్  పై నీర్గురియా అకాడమి జట్టు (93-  40)  53 పాయింట్ల తేడాతో  ఘనవిజయం సాధించింది హైదరాబాద్. బి.ఎం.టి.సి బెంగళూరు, డిల్లీ ఆర్మీ జట్ల మధ్య జరిగిన పోటీలో డిల్లీ ఆర్మీ 62 -15 స్కోరుతో సునాయాసంగా గెలుపొందింది. మహిళల విభాగంలో:-చెన్న బసవేశ్వర జట్టు పై హిమాచల్ ప్రదేశ్ జట్టు 68 – 23 స్కోరుతో సునాయాసంగా 45 పాయింట్ల తేడాతో విజయం సాదించింది.. మహారాష్ట్ర జట్టు పై హర్యానా జట్టు 46- 32 స్కోరుతో నెగ్గింది. ఈ పోటీలో సోనాలీ (హర్యానా) ఉత్తమ క్రీడాకారిణిగా ఎంపికయ్యింది. కేరళ జట్టుపై చెన్న బసవేశ్వర అకాడెమీ జట్టు 36 – 20 స్కోరుతో విజయం సాదించింది..ఉత్తమ క్రీడాకారులకు నగదు బహుమతి అందచేశారు.

Spread the love
error: Content is protected !!