Recent Posts

ఆదివారం వ్యాయమం చేయని వారు వీడియో చూడండి-మహేంద్ర

అమరావతి: ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చేసే పోస్టులకు చాలా క్రేజ్ వుంది.అరుదైన సంఘటనలు,మనస్సును కదిలించే వీడియోలు,ఫోటోలు ట్విట్టర్ వేదికగా పోస్టులు చేస్తుంటారు.ప్రస్తుతం కొత్త వీడియోను ట్వీట్టర్ లో పోస్టు చేస్తు,ఆదివారం ఎక్సర్ సైజ్ చేయని వారు ఈ వీడియో చూస్తే చాలు అంటూ ట్వీట్ లో వెల్లడించారు.ఈ వీడియోలో జిమ్నాస్ట్ లు చేసిన విన్యాసాలు ఉన్నాయి.రోజూ ఎక్సర్ సైజ్ చేస్తున్నవాళ్లు ఆదివారం నాడు కొంత బద్ధకంగా ఉంటారని తెలిపారు.ఆదివారం నాడు వ్యాయమం చేయడానికి ఉత్సాహం చూపని వారికి ఓ పరిష్కారం ఉందని, తనలాగే ఈ వీడియో క్లిప్ ను సేవ్ చేసుకోవాలని సూచించారు.కనీసం రెండుసార్లు ఈ వీడియో చూడాలని, ఇలా చేయడం వల్ల శరీరంలోని ప్రతి కండరానికి వ్యాయామం చేసిన ఫీలింగ్ కలుగుతుందన్నారు. మీరు అలసిపోతారు అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Spread the love