Recent Posts

పశ్చిమ దేశాల దురాక్రమణను నివారించేందుకే ఈ ప్రత్యేక సైనిక చర్య-పుతిన్

అమరావతి: ఉక్రెయిన్ పై సైనిక చర్య చేపట్టడడానికి గల కారణాలపై,,రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ స్పష్టతఇచ్చారు. ఉక్రెయిన్ మాతృభూమిని కాపాడటం కోసమే ఈ సైనిక చర్య చేపట్టినట్లు చెప్పుకొచ్చారు..సోమవారం రష్యాలోని మాస్కోలో విక్టరీ డే సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు..ఉక్రెయిన్‌లో పశ్చిమ దేశాల దురాక్రమణను నివారించేందుకే ఈ ప్రత్యేక సైనిక చర్య నిర్వహించాం.. ఉక్రెయిన్ సమగ్రత, భద్రతను కాపాడేందుకు రష్యాలు బలగాలు అక్కడ పోరాడుతున్నాయి’’ అని పుతిన్ అన్నారు..రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ ఓటమికి గుర్తుగా రష్యాలో ప్రతి సంవత్సరం మే 9వ తేదిన విక్టరీడేని భారీ ఉత్సవాలుగా నిర్వహిస్తారు..అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మాస్కోలోని రెడ్ స్క్వేర్ వద్ద పరేడ్‌ను నిర్వహించారు..ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని రెండో ప్రపంచ యుద్ధంలో సోవియట్ పోరాటంతో పుతిన్ పోల్చారు.రష్యా తోలి నుంచి,, పశ్చిమ దేశాల ద్వందా విధానాలకు,, ప్రతిచర్యగానే ఉక్రెయిన్‌లో సైనిక చర్య చేపట్టామని చెప్పుకుంటూ వస్తోంది..నియో నాజీలను ఉక్రెయిన్ నుంచి తరిమి కొడతామని రష్యా స్పష్టం చేస్తు వస్తోంది..

Spread the love
error: Content is protected !!