AMARAVATHIDISTRICTS

కార్పొరేషన్ లో కమీషనర్ల సంతకాలను ఫోర్జరీ చేసే దొంగలు?

TPOలు,WPRSలు సస్పెన్షన్..

ఫోర్జరీ బాగోతం వెనుక వున్న పెద్ద తలకాయలు ఎవరు ? విజిలెన్స్ నివేదిక పేరుతో కాలయాపన జరిగిపోతుందా ? లేక నిజంగా నివేదిక అందిన వెంటనే కఠిన చర్యలు వుంటాయా?

నెల్లూరు: నగర పాలక సంస్థలో ఉద్యోగల ముసుగులో వున్న సంతకాల ఫోర్జరీ చేసిన 4గురు దొంగలను కమిషనర్ వికాస్ మర్మత్ శుక్రవారం వారిని విధులనుంచి తొలగిస్తూ సస్పెన్షన్ ఉత్తర్వులను కమిషనర్ జారీ చేశారు.. కమిషనర్ వికాస్ మర్మత్,,నగర పాలక సంస్థ గత కమిషనర్ శ్రీమతి.హరిత సంతకాలను ఫోర్జరీ వ్యవహారంలో ముందస్తు విచారణ అనంతరం టౌన్ ప్లానింగ్ అధికారులు 2,, మరో 2 సచివాలయ వార్డు ప్లానింగ్ అండ్ రెగులేషన్ కార్యదర్శులను బాధ్యులుగా గుర్తించి వారిని విధులనుంచి తొలగిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు..నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (టి.పి.ఓ) లుగా విధులు నిర్వహిస్తున్న బి.ప్రవీణ్, ఎమ్.దేవేంద్ర, 12 వ డివిజన్, 24వ డివిజన్ల సచివాలయాల వార్డు ప్లానింగ్ అండ్ రెగులేషన్ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్న పి. నాగేంద్ర బాబు, కె. కార్తీక్ మాలవ్య లను సస్పెండ్ చేశారు..ఆరోపణలపై వివరణ కోరుతూ పైన సూచించిన వారికి గతంలో కమిషనర్ షోకాజు నోటీసులు జారీ చేయగా, అందుకు వారు అందించిన వివరణ సంతృప్తికరంగా లేదని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నామని కమిషనర్ తెలిపారు.. వీరితో పాటు ఆరోపణలపై ఎల్.టి.పి దిలీప్ కుమార్ కు షోకాజ్ నోటీసును జారీ చేశారు.. ఎల్.టి.పి. నుంచి వ్రాతపూర్వక వివరణ అందుకున్నాక తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు..టి.పి.ఓ. ప్రవీణ్ స్థానంలో ఇంఛార్జిగా దశయ్య, దేవేంద్ర స్థానంలో ప్రకాష్ బాబులను అధికారులుగా నియమించినట్లు కమిషనర్ ప్రకటించారు..సంతకాల ఫోర్జరీపై విజిలెన్స్ విభాగం ద్వారా విచారణకు రాష్ట్ర డి.జి.విజిలెన్స్ అధికారులు విచారించి తగు నివేదికలను అందించాలని కోరుతు లేఖ ద్వారా కోరామని కమిషనర్ తెలియ చేశారు.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *