Recent Posts

వీరు సింగిల్ డోసు వ్యాక్సిన్ తీసుకున్న చాలు

అమరావతి: కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌తో చెక్‌ పెట్టే ప్రక్రియను కేంద్రం యుద్దప్రతిపాదికను నిర్వహిస్తు,ఇప్పటికి 63 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేసింది.. ఈ నేపథ్యంలో క‌రోనా బారిన ప‌డి కోలుకున్న వాళ్లకు ICMR అధ్యయ‌నంలొ ఇప్పటికే కోవిడ్‌ సోకినవాళ్లు కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఒక్క డోసు తీసుకున్నా,కోవిడ్‌ సోకని వాళ్లు రెండు డోసుల కోవాగ్జిన్ తీసుకుంటే వ‌చ్చే యాంటీబాడీలు అదే స్థాయిలో వస్తాయని రుజువైనట్లు పేర్కొంది..ఆధ్యయన ఫలితాలను ఇండియ‌న్ జ‌ర్నల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్‌లో పబ్లిష్ అయ్యాయి..క‌రోనా సోకి త‌గ్గిపోయిన వాళ్లకు సింగిల్ డోసు BBV152 కోవాగ్జిన్‌ చాలని, దీని వల్ల వ్యాక్సిన్ కొర‌త‌ను కూడా అధిగ‌మించే అవ‌కాశం ఉంటుందని ICMR పేర్కొంది.తమ అధ్యయనం ఆరోగ్య కార్యక‌ర్తలు, ఫ్రంట్‌లైన్ వ‌ర్కర్లపై నిర్వహించామని ప్రకటించింది.ఇందులో భాగంగా SARS-CoV-2కు సంబంధించిన యాంటీబాడీలు డే జీరో, కోవాగ్జిన్‌ తొలి డోసు తీసుకున్న త‌ర్వాత 28వ రోజున‌, 56వ రోజున ఎలా ఉన్నాయో పరిశీలించామని,దీనికోసం 114 మంది ర‌క్త న‌మూనాల‌ను సేక‌రించామని,వారంతా మహమ్మారి సోకినవాళ్లలేనని వెల్లడించింది.ఇద్దరిలో తప్ప మిగ‌తా వాళ్లంద‌రిలోనూ కోవాగ్జిన్ సింగిల్ డోసు తీసుకున్న త‌ర్వాత యాంటీబాడీల వృద్ధి చాలా ఎక్కువ‌గా ఉన్నట్టు గుర్తించామని వెల్లడించింది.అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది..

Spread the love