AMARAVATHI

అధికారులపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవు-మంత్రి నారాయ‌ణ‌

నెల్లూరు: ప్రజలకు సుపరిపాలన అందించడమే ధ్యేయంగా టీడీపీ ప్ర‌భుత్వ ప‌రిపాల‌న ఉంటుంద‌ని, అందుకు త‌గిన‌ట్లుగానే అధికారులు పనిచేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖమంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియ‌జేశారు. గురువారం క‌లెక్ట‌రేట్‌లో జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తో కలసి హౌసింగ్, రెవెన్యూ, ఎక్సైజ్, మైన్స్, విద్యుత్ శాఖల పనితీరుపై సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఆయా శాఖ‌ల ప‌నితీరుపై మంత్రి ఆరా తీశారు. అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు స‌ల‌హాలు ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించడమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని ఘంటాప‌థంగా చెప్పారు. అధికారులపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని తెలియ‌జేశారు. ప్రజల కనీస అవసరాలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళుతున్నామ‌న్నారు. త్వరలోనే మ‌రోసారి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి ఆయా శాఖ‌ల ద్వారా ప్ర‌జ‌ల‌కు అందాల్సిన సంక్షేమాభివృద్ధిపై చ‌ర్చిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అదేవిధంగా ఏ ప్రాంతంలోనైనా ప్ర‌జ‌లు సుఖంగా జీవించాలంటే ఆ ప్ర‌దేశంలో రోడ్డు, నీరు, డ్రైన్‌, క‌రెంట్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని, ఆ దిశ‌గా నిరుపేద‌ల‌కు ఇళ్లు మంజూరు చేసే స్థ‌లాల వ‌ద్ద చ‌ర్య‌లు చేప‌డుతామ‌ని చెప్పారు. ప్ర‌భుత్వం బ‌డ్జెట్ మంజూరు చేసే అధికారులు ప‌నులు చేసేందుకు వీలుంటుంద‌న్నారు. ఎలక్ట్ర‌సిటీ, మైన్స్ పై మ‌రోసారి క్షుణ్ణంగా చ‌ర్చిస్తామ‌ని తెలిపారు. నియ‌మ‌నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. లేఅవుట్స్ వేసేవారు నుడా నియ‌మాల‌ను పాటించాల‌ని సూచించారు. నియ‌మ‌నిబంధ‌న‌లు స‌రిగా ఉంటే వెంట‌నే మంజూరు ప‌త్రాల‌ను అంద‌జేస్తామ‌ని తెలిపారు. అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని తెలిసింద‌ని దానిపై కూడా మాట్లాడ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

రూ.10,20 నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం-ఉత్తర్వులు జారీ చేసిన రిజర్వ్ బ్యాంకు

IPC సెక్షన్ 124A... అమరావతి: ప్రభుత్వం గుర్తించిన 10 లేక 20 రూపాయల నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం…

4 hours ago

ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను పెంచి అందించాం-మంత్రి నారాయణ

నెల్లూరు: ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన మాట ప్రకారం గతంలో ఇస్తున్నరూ.3వేలు పింఛన్‌కు రూ.వెయ్యి పెంచి రూ.4వేలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందించారని,…

5 hours ago

నెల్లూరు గవర్నమెంట్ డాక్టరు జ్యోతిది ఆత్మహత్యేనా ?

డాక్టరు జ్యోతి మరణం వెనుక వున్న కారణం ఏమిటి అనే “నిజం” పోస్టుమార్టం తరువాత వెలుగులోకి వస్తుందా ? లేక…

6 hours ago

ఒక్క రూపాయి జీతం తీసుకోకుండా పనిచేస్తాను-పవన్ కళ్యాణ్

అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో సోమవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో…

7 hours ago

జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న 8,500 ఉద్యోగులు-మంత్రి నారాయణ

జిల్లాలో 313757మంది లబ్ధిదారులకు రూ. 214.50 కోట్లు.. నెల్లూరు: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం తెల్లవారుజామున నుంచి సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం…

1 day ago

రాజకీయ నేతల గుప్పెట్లో క్రీడా సంఘాలు బందీ అయ్యాయి-క్రీడాకారులు

పవన్ కల్యాణ్ హామీ.. అమరావతి: గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్నీ రంగాలూ అథోగతి పాలయ్యాయని, అలాగే క్రీడారంగం సైతం…

1 day ago

This website uses cookies.