Recent Posts

హిందూ దేవుళ్లను కించపరిచిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు-ఎమ్మెల్యే రాజా సింగ్

హైదరాబాద్: హిందూ దేవుళ్లను కించపరిచిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరించారు.. హిందూ దేవుళ్లపై ఇద్దరు యువతీ, యువకులు చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్ అవుతుంది..ఈ విషయంపై రాజా సింగ్ మాట్లాడుతూ హైటెక్ సిటీలోని బడా కంపెనీల్లో పనిచేసే కొంతమంది ఉద్యోగులు,, పనీ, పాటా లేని వాళ్లు హిందూ దేవుళ్లను కించపరుస్తూ కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు..హిందూ దేవుళ్లపై అభ్యంతరకర కామెంట్‌లు చేసిన వారిని జైలుకు పంపేదాకా వదిలిపెట్టమని ఉరుకునేదిలేదన్నారు..ఈ మేరకు సదరు యువతీ, యువకులు మాట్లాడిన వీడియోతోపాటు పూర్తి వివరాలను పోలీసు కమిషనర్‌‌కు లేఖ ద్వారా తెలిపామన్నారు..దేవుళ్లపై కామెంట్స్ చేసిన వారిని 24 గంటల్లోగా అరెస్ట్ చేయాలని,,మీడియా ముందు వారిని ప్రవేశ పెట్టాలన్నారు.. ఎంఐఎంపై ఎవరైనా కామెంట్ చేస్తే వెంటనే అరెస్టు చేసే పోలీసులు,,హిందూ దేవుళ్లను కించపరిచిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు..కామెంట్ చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తారనే నమ్మకం ఉందని,,వారిని అరెస్టు చేయకపోతే తమ దగ్గర వారి అడ్రస్ ఉందని పేర్కొన్నారు..

Spread the love