Recent Posts

దసరాకు ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదు-సజ్జనార్

అమరావతి: ఒక వైపు APSRTC దసరా పండుగ సందర్భంగా నడిపే స్పషల్ బస్సులకు ఆదనపు చార్జీలు వసూలు చేస్తున్నమని ప్రకటిస్తుండగా,, ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని TSRTC ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు.రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అదనపు ఛార్జీలు ఉండవని స్పష్ట చేశారు..గడిచిన ఐదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1.30 కోట్ల మంది ప్రయాణికులను TSRTC సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిందన్నారు..ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణికుల సౌకర్యం భధ్రతే ధ్యేయంగా ఈ పండుగ సమయంలో తాము ఆర్టీసీ సేవలు అందిస్తున్నామన్నారు..ఆర్టీసీలో ప్రయాణిస్తూ ప్రయాణీకులు చూపించే ఆదరాభిమానాలే సంస్థ పురోభివృద్ధికి  తోడ్పాటునందిస్తాయని తాము ఆకాంక్షిస్తున్నామన్నారు.. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో  ప్రయాణించి సురక్షితంగా గ్యమస్థానాలకు చేరుకోవాలని కోరారు..

Spread the love