July 4, 2022

పట్టపగలు నెల్లూరు నడిబొడ్డున దారుణమైన హాత్య యత్నం ?

నెల్లూరు: పాత కక్ష్యల కారణంగా పట్టపగలు నెల్లూరు నడిబొడ్డున దారుణమైన హాత్య యత్నం జరిగింది..స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా వున్నాయి… విజయ్(33) అనే యువకుడిని,, నగరంలోని జెండా వీధి ప్రాంతంకు చెందిన యువకులు దారుణంగా పోడిచంపారు…గురువారం మధ్యహ్నం 3.30 గంటల సమయలో ఈ సంఘటనలో నగర నడిబొడ్డున టౌన్ హౌల్ ఎదురు వీధి అయిన దండువారి వీధిలో జరిగింది..కుక్కుల గుంట ప్రాంతంకు చెందిన విజయ్ వి.ఆర్.సి ఎదురుగా వున్న మదీనా షో రూమ్ ప్రక్కన వున్న పప్పిస్ జీన్స్ షాపులో పనిచేస్తున్నారు..దాదాపు 6 నెలల క్రిందట,విజయ్ తమ్ముడు విషయంలో,,హత్య చేసిన యువకులకు మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి..దింతో హత్య చేసిన యువకులు,,విజయ్ తమ్ముడు కొట్టేందుకు అతని ఇంటి వద్దకు వెళ్లారు..అదే సమయంలో ఇంట్లో వున్న విజయ్ వారిని వారించి,,బయట గొడవలు ఇంటి వద్దకు రావడం ఏమిటని ఆగ్రహాం వ్యక్తం చేశాడు..ఇదే సమయంలో కుక్కలగుంట ప్రాంతంలో వున్న స్థానికులు,,హత్యచేసిన యువకులపై చేయ్యిచేసుకున్నారు.దింతో హత్య చేసిన యువకులు ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడం,అపైను ఇరువర్గాలకు చెందిన వారు జోక్యం చేసుకుని,,వీరిద్దర మధ్య రాజీ కుదిర్చరు..అయితే జరిగిన సంఘటన మనుస్సులో వుంచుకున్న హాత్య చేసిన యువకులు,గురువారం సిగిరేట్ త్రాగేందుకు టౌన్ హౌల్ ఎదురుగా వున్న ఓ షాపు వద్దకు రాగానే,ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం,,ఇద్దరు యువకులు,విజయ్ ను మారణాయుధాలతో దాడి చేసి,ఒకే బైక్ పై వెళ్లిపోయారు..తీవ్రగాయాలతో రోడ్డుపైనే పడి వున్న విజయ్ ను కనీసం ఆసుపత్రికి తరలించేందుకు ఎవ్వరు ముందుకు రాలేదు.ఓ పత్రిక చెందిన విలేఖరి జోక్యం చేసుకుని పోలీసులకు సమాచారం అందించడంతో,,20 నిమిషాల తరువాత పోలీసులు విజయ్ ను ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూన్నట్లు సమాచారం..పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు..

Share
error: Content is protected !!