Recent Posts

అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లె కాలినడక మార్గం ఈ నెల 11న ప్రారంభం

తిరుపతి: తిరుమల శ్రీవారి భక్తులు అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లె కాలినడక మార్గంను ఈ నెల 11 నుంచి టీటీడీ భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది.తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతీరోజు వేల సంఖ్యలో భక్తులు నడక మార్గంలో వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు.అలిపిరి నడక మార్గంలో మరమ్మతులు, ఆధునీకరణ పనుల కోసం గత సంవత్సరం సెప్టెంబరులో పనులు ప్రారంభంమైయ్యాయి. ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుమలకు నడకదారి భక్తులు వెళ్తున్నారు.అలిపిరి నడకదారిపైన దశాబ్దాల క్రితం నిర్మించిన పైకప్పు శిథిలావస్థకు చేరుకుంది. దీంతో అలిపిరి మెట్ల మార్గంలో పైకప్పును కొత్తగా నిర్మించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అందుకు అయ్యే మొత్తం ఖర్చు 25 కోట్ల రూపాయలను, టీటీడీకి విరాళంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ అందచేసింది..అలిపిరి పాదాల మండపం వద్ద నుంచి గాలిగోపురం వరకు 1.4 కిలోమీటర్ల మేర మెట్ల దారిలో 7.5 కోట్ల వ్యయంతో గాల్వలూమ్ షీట్లను ఏర్పాటు చేశారు..గాలి గోపురం నుంచి నరసింహ స్వామి ఆలయం వరకు 3 కిలోమీటర్ల మేర పైకప్పుకు,సిమెంట్ శ్లాబ్ ఏర్పాటు చేశారు.ఇందుకోసం 17.5 కోట్ల రూపాయలు కేటాయించారు. నడకదారిలోని నరసింహస్వామి వారి ఆలయం నుంచి తిరుమల వరకు ఉన్న పైకప్పు కొత్తగా నిర్మించినదే కావడంతో దానికి ఎటువంటి మరమ్మత్తులు నిర్వహించలేదు..

Spread the love