Recent Posts

రానున్న 14 రోజుల్లో వైరస్ మరింత పెరిగే ఆవకాశం-ఐఐటీ మద్రాసు

అమరావతి: కరోనా వైరస్​ వ్యాప్తి కొద్దిగా తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నయని మద్రాస్​ ఐఐటీ పేర్కొంది..కరోనా వైరస్ వ్యాప్తి వేగంను అంచన వేసేందుకు ఉపయోగించే R Value Data​ ఆధ్యయనం చేసిన అనంతరం వివరాలు ఐఐటీ మద్రాసు వెల్లడించింది..కరోనా వ్యాప్తి డిసెంబర్​ 24 నుంచి 31 వరకు 2.9,,, జనవరి 1 నుంచి 6 వరకు 4,,, జనవరి 7 నుంచి 13 వరకు 2.2,,, జనవరి 14 నుంచి 21 వరకు 1.57 గా నమోదు అయినట్లు మద్రాస్​ ఐఐటీ పేర్కొంది..ఈ వ్యాల్యూని కంప్యూటేషనల్ మోడలింగ్ ద్వారా ప్రాథమిక విశ్లేషణ జరిపి లెక్కించినట్లు పరిశోధకులు తెలిపారు. ఆర్​ వ్యాల్యూ ముంబయిలో 0.67, దిల్లీలో 0.98, చెన్నైలో 1.2, కోల్​కతాలో 0.56 గా నమోదు అయినట్లు పేర్కొన్నారు. ముంబయి, కోల్​కతాలో R Value ఇప్పటికే అత్యధిక స్థాయికి చేరుకుని తగ్గుముఖం పట్టినట్లు వివరించారు. దిల్లీ, చెన్నైలో ఇంకా ఒకటికి దగ్గరగా ఉన్నట్లు స్పష్టం చేశారు..మూడో వేవ్​లో వైరస్​ బారిన పడే వారి సంఖ్య రానున్న 14 రోజుల్లో మరింత పెరిగి..గరిష్ఠాన్ని తాకుతుందని అంచనా వేశారు. R Value 1 కంటే తక్కువగా నమోదు అయితే వైరస్​ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లుగా పరిగణించాల్సి ఉంటుందని చెప్పారు..

Spread the love
error: Content is protected !!