Recent Posts

థర్డ్ వేవ్ మొదలైంది-రాష్ట్రాలు నిశితంగా పరిశీలిస్తూ ఉండాలి-ICMR అడ్వయిజరీ నోట్

ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య 5 నుంచి 10 లోపే..

ఆప్రమత్తంగా వుండాలి..

అమరావతి: దేశ వ్యాప్తంగా రాబోయే 3 నుంచి 4 వారాల వ్యవధిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 5 లక్షల వరకు పెరిగే అవకాశముందని నిపుణులు అంచనావేస్తున్నారు. దేశంలో థర్డ్ వేవ్ మొదలైన నేపథ్యంలో కరోనా తీవ్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు పంపించింది..కరోనా పాజిటివ్  కేసుల్లో 5 నుంచి 10 శాతం మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరాల్సి వస్త్తోందని,,సెకండ్ వేవ్ సమయంలో 20 నుంచి 23 శాతంగా ఉందని పేర్కొంది..కరోనా వ్యాప్తి చేందే పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతు వస్తున్నాయని,,ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశముందని కేంద్ర ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది..ఒమిక్రాన్ కొత్త వేరియంట్‌ ప్రభావంతో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయని,,అలాగే డెల్టా వేరియంట్ ప్రభావం ఇంకా కొనసాగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది..రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కరోనా కేసులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ ఉండాలని కోవిడ్ అడ్వైజరీలో నోట్ లో కేంద్ర ఆరోగ్య శాఖ రాజేశ్ భూషణ్ సూచించారు.. యాక్టివ్ కేసుల సంఖ్య,, హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులు,, ఆక్సిజన్ బెడ్స్ అవసరం వున్నబాధితులు,,ఐసీయూ బెడ్స్,,వెంటిలేషన్ సౌకర్యలను నిరంతరం పరిశీలిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు..దిని ప్రభావంపై రోజువారీగా పరిస్థితిని సమీక్షించాలన్నారు..

Spread the love
error: Content is protected !!