Recent Posts

నెల్లూరు నగర కార్పొరేషన్ లో ఒక్క స్థానం కూడా దక్కించుకోలేక కుప్పకూలిన టీడీపీ

నాయకత్వం లోపమా ?

నెల్లూరు: నగర కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ టీడీపీని తుడిచిపెట్టేసింది..ప్రతిపక్ష టీడీపీ జిల్లా,నగర స్థాయి నాయకులు తీసుకున్న నిర్ణయాలతో ఖచ్చితంగా గెలుస్తాము అనుకున్న డివిజన్లల్లో,,గెలిచే అభ్యర్దులను ప్రక్కన పెట్టి,,డివిజన్స్ లో కనీసం ముఖ పరిచయం లేని వ్యక్తులను బరిలోకి దించింది..మరి దిని వెనుక ఏ కథ నడిచిందో ?? దింతో ఒక్క స్థానం కూడా దక్కించుకోలేక కుప్పకూలిపోయింది..ఇటీవల కాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల,,వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అంటూ లెక్కల వేసుకున్న నాయకులు,,డివిజన్ల స్థాయిలో పట్టు వున్న వ్యక్తులను రంగంలోకి దింపడంలో పూర్తిగా విఫలమైయ్యారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..ఇదే సమయంలో వైసీపీ నాయకులు గత కొంత కాలం నుంచి క్షేత్ర స్థాయిలో ముమ్మరంగా తిరుగుతు,ప్రతిపక్షపార్టీలను అన్ని రకాలుగా కట్టడి చేసేందుకు వ్యుహాలు సిద్దం చేసుకున్నారు..మొదటి నుంచి టీడీపీ అంటిపెట్టుకుని,, ఈసారి అయిన మునిసిపాల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇస్తారు అనుకుంటే,అలాంటి వారికి సైతం నాయకులు మొండి చెయ్యి చూపించడంతో,సదరు డివిజన్ కార్యకర్త వెంటనే వైసీపీలో చేరడం,అతని డివిజన్ లోనే పోటీ చేసేందుకు వైసీపీ టిక్కెట్ కేటాయించారు..ఇలాంటి సంఘటనలు చెప్పుకుంటు పోతే..? టీడీపీ తరపును పోటీలోకి దిగిన అభ్యర్దులను చూసి,నగర ప్రజలు సైతం పెదవి విరిచారంటే,కార్పొరేషన్ ఎన్నికలను టీడీపీ నాయకులు సమర్దవంతంగా ఎదుర్కొలేక పోయారనేది రుజువుఅయ్యింది..మరి భవిష్యత్ టీడీపీ పరిస్థితి ఏమిటి ?.? నెల్లూరు కార్పోరేషన్ లో మొత్తం 54 డివిజన్లు ఉన్నాయి.ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఇక్కడ 8 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి..ఈ స్థానాలు మొత్తం వైసీపీ ఖాతాలో జమ కాగా కార్పొరేషన్ ఎన్నిక జరిగిన 46 డివిజన్లలో 46 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయం సాధించి, ఏకగ్రీవాలతో కలిపి 54 డివిజన్లను కైవసం చేసుకొన్న వైఎస్సార్‌సీపీ నెల్లూరు నగరంలో కొత్త రికార్డు క్రియేట్ చేసింది..

Spread the love
error: Content is protected !!