Recent Posts

క్రమేపీ ఆప్ఘనిస్తాన్ పై పట్టు బిగిస్తున్నతాలిబన్లు

క్రమేపీ తాలిబన్ల చేతికిలోకి వెళ్లుతున్న ఆప్ఘనిస్తాన్క్రమేపీ తాలిబన్ల చేతికిలోకి వెళ్లుతున్న ఆప్ఘనిస్తాన్అమరావతి: తాలిబన్ల కృరత్వం చవిచూసిన ఆప్ఘనిస్తాన్ ప్రజలు మళ్లీ అలాంటి దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుందని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు..ఇది ఇలా వుండగా అఫ్ఘ‌నిస్తాన్ నుంచి అమెరికా త‌న బ‌ల‌గాల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌డం దాదాపు పూర్తి కావడస్తుండడంతో మ‌ళ్లీ ఆ ప్రాంతంలో తాలిబన్లు  రెచ్చిపోతున్నారు.. దాదాపు రెండు ద‌శాబ్ధాల‌పాటు ఆఫ్ఘ‌న్‌లో అమెరికా బ‌ల‌గాలు మోహ‌రించి ఉగ్ర‌వాదుల కార్య‌క‌లాపాల‌ను అణిచివేశాయి..ఒసామ బిన్ లాడెన్ హంతం చేసిన తరువాత అమెరికా త‌న బ‌ల‌గాల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌డం మొద‌లు పెట్టింది..ఒక వైపు అమెరికా బలగాల ఉపసంహరణ ప్రారంభంమైనప్పటి నుంచే తాలిబ‌న్లు ఆఫ్ఘ‌న్‌లోని కీల‌క ప్రాంతాల‌ను స్వాదీనం చేసుకోవ‌డం మొద‌లుపెట్టారు..ద‌క్షిణ ప్రాంతాల‌పై ఇప్ప‌టికే ప‌ట్టుబిగించిన తాలిబ‌న్లు, ఆ ప్రాంతంలో కీల‌క‌మైన కాంద‌హార్ ను ఆదీనంలోకి తెచ్చుకునే ప్ర‌య‌త్నం మొద‌లుపెట్టారు.. కాంద‌హార్ తాలిబ‌న్ల‌కు కీల‌క‌మైన స్థావ‌రం..గ‌తంలో ఈ న‌ర‌గంపై ఉగ్ర‌వాదుల‌కు ప‌ట్టు ఉండేది..ఇప్పుడు మ‌రోసారి ఆ న‌గ‌రాన్ని స్వాదీనం చేసుకోబుతున్నారు..ఇప్ప‌టికే ప్ర‌జ‌లు అంత‌ర్యుద్ధంతో అతలాకుత‌లం అవుతున్నారు..ఆఫ్ఘ‌నిస్తాన్‌లోని కీల‌క ప్రాంతాలు తాలిబ‌న్ల చేతిలోకి వెళ్తె, అక్క‌డి ప్ర‌జ‌లు మ‌రింత దారుణమైన జీవితాన్ని గ‌డ‌పాల్సి వ‌స్తుంది..ప్రస్తుతానికి కాంద‌హార్‌లో ఉన్న భార‌త కాన్సులేట్ కార్యాల‌యాన్ని మూసివేసి దౌత్యాధికారులు ప్ర‌త్యేక విమానంలో భార‌త్ కు చేరుకున్నారు..

Spread the love