Recent Posts

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షే పథకాలు అందేలా సచివాలయం సిబ్బంది కృషి చేయాలి-కలెక్టర్

నెల్లూరు: ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా సచివాలయం సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అన్నారు.మంగళవారం గూడూరు పురపాలక సంఘం పరిధిలోని ఇందిరానగర్ లోని 18వ నెంబరు వార్డు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది హాజరు,రిజిస్టరును,వివిధ పథకాల ఆమలుకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు,ఆదేశాలు జారీ చేశారు..లబ్దిదారుల వివరాలు తెలిపే బోర్టులను కలెక్టర్ పరిశీలించారు.సచివాలయాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను నిర్దేశించిన గడువులోపు ప్రజలకు అందించాలని సిబ్బందిని అధేశించారు..ముఖ్యంగా ఇంది పట్టా కోసం వచ్చే దరఖాస్తులను క్షుణంగా పరిశీలించి నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలని,ఫించన్లు కూడా సకాలంలో ఫించనుదారులకు అందించేలా చూడాలన్నారు.

Spread the love