Recent Posts

రెండవ దశ కోవిడ్ కట్టడి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి- ప్రజారోగ్య వేదిక

నెల్లూరు: రాష్ట్రంలో కోవిడ్ రెండవ దశ వ్యాప్తి తీవ్ర రూపం దాలుస్తుందని,,రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయని,ఈలాంటి సమయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల అమలులో జాప్యం జరుగుతుందని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు ఎం.వి.రమణయ్య,,కామేశ్వరావులు ఒక ప్రకటనలో తెలిపారు..ఈ సమయంలో ప్రజారోగ్య వేదిక జరిపిన సమీక్షలో 13 జిల్లాలలోనూ ఆసుపత్రులు, వైద్య సదుపాయాలు,,మందులు,,ఆక్సిజన్ కొరత,,రోగుల ఇబ్బందులు ఇంచు మించుగా ఒకే విధంగా ఉన్నాయని తెలిసిందన్నారు.. కరోనా కట్టడి,,వైద్యం అందించడంలో ఉన్న సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం వెంటనే పలు చర్యలు తీసుకోవాలని కోరారు..1. కోవిడ్,,నాన్ కొవిడ్ వైద్య సదుపాయాల నిమిత్తం ప్రత్యేకమైన ఇంటరిమ్  బడ్జెట్ ను వెంటనే విడుదల చేయాలి. దానికి తగ్గట్టుగా రోగులకు అన్ని జిల్లాలలో వైద్య సదుపాయాలు మెరుగుపరచాలి.2. వ్యాక్సినేషన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలి. రాష్ట్రప్రభుత్వం చొరవ చూపి వ్యాక్సిన్ కంపెనీలతో నేరుగా ఒప్పందం కుదుర్చుకొని రాష్ట్ర ప్రజలందరికీ త్వరితగతిన వ్యాక్సిన్ అందించాలి.3- కార్పొరేట్,,ప్రైవేట్ ఆసుపత్రులలో ప్రభుత్వం నిర్ణయించిన కోవిడ్ వైద్య సేవల ధరలు ఖచ్చితంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలి..4- కోవిడ్ మందులు,,ఆక్సిజన్ బ్లాక్ మార్కెటింగ్ పై మరింత నిఘా పెట్టాలి..5- క్వారంటైన్ సెంటర్ల సంఖ్యను పెంచాలి. కోవిడ్ వ్యాధి వ్యాప్తి తీవ్రత దృష్ట్యా మండల స్థాయిలో కూడా క్వారంటైన్  సెంటర్లను ఏర్పాటు చేయడం లాంటి మరో 8 సూచనలను చేశారు..

Spread the love