AMARAVATHIINTERNATIONAL

మక్కాలో మండిపోతున్న ఎండలు,భారతదేశం నుంచి హజ్ యాత్రికు వెళ్లిన 90 మంది మృతి- AFP

అమరావతి: ముస్లింల పవిత్ర హజ్‌ యాత్రలో ఈ సంవత్సరం గతంలో ఎప్పుడు లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో,ఇప్పటి వరకు 645 మంది యాత్రికులు మరణించినట్లు ఫ్రాన్స్ కు చెందిన న్యూస్ ఏజెన్సీ సంస్థ(AFP) వెల్లడించింది..మరణించిన వారిలో వివిధ ఆనారోగ్య కారణలు వుండగా అందులో ఎండ వేడిమి తట్టుకొలేక మరణించిన వారిలో ఎక్కువ శాతం మంది వయస్సు మళ్లీన వారుగా AFP పేర్కొంది..మక్కాలో ప్రస్తుతం 50 డిగ్రీల సెల్సియస్‌కు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి..ఈ సారి యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని,,ఇందులో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నట్లు సౌదీ హజ్‌ నిర్వాహకులు వెల్లడించారు.. మరో రెండు లక్షల మంది సౌదీ అరేబియా వాసులుగా పేర్కొన్నారు..

చనిపోయినవారిలో వివిధ దేశాలకు చెందిన యాత్రికులు ఉన్నారని,,ఈజిప్ట్‌, జోర్దాన్‌ దేశస్తులు అధికంగా ఉన్నట్లు తెలిపారు.. సుమారు 323 మంది ఈజిప్టియన్లు,,90 మందికిపైగా జోర్డానియన్లు మ‌ర‌ణించినట్లు తెలిపారు.. మరణించిన యాత్రికుల్లో దాదాపు 68 మంది భారతీయులు కూడా ఉన్నట్లు ఓ దౌత్యాధికారి వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా ఏజెన్సీ అయిన AFP పేర్కొంది.. భారతీయుల సంఖ్యపై సౌదీ అధికారులు కానీ భారత ప్రభుత్వం గానీ ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు..ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్, ట్యునీషియా,ఇరాక్,అలాగే కుర్దిస్తాన్ ప్రాంతానికి చెందిన దేశాల అధికారులు కూడా మరణాలను ధృవీకరించారు..అయితే సదరు దేశాలకు చెందిన అధికారులు మరణాలకు గల కారణాన్ని పేర్కొనలేదు.

ఎండ తీవ్రతకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఉపశమనం కలిగించడం లేదని సౌదీ అధికారులు పేర్కొన్నారు.. మక్కాలోని అతిపెద్ద ఆసుప‌త్రుల్లో ఒక‌టైన‌ అల్-ముయిసెమ్ ఆసుప‌త్రిలో మృతదేహాలను ఉంచినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి..మృతదేహాలను సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు..గతేడాది హజ్‌ యాత్రలో 240 మంది యాత్రికులు మరణించిగా వారిలో చాలా మంది ఇండోనేషియాకు చెందిన వారే ఉన్నట్లు సౌదీ మీడియా తెలిపింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *