Recent Posts

”మా” ఎన్నికల్లో పైకి కన్పించని రౌడీయిజం,పోస్టల్ బ్యాలెట్‌లో అన్యాయం జరిగింది-ప్రకాష్

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచిన 11 మంది వారి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకాష్ రాజ్ ప్రకటించారు.మంగళవారం అయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి పై విషయంను పలు ఆసక్తి కరమన ఆంశాలను వెల్లడించారు..ఎలక్షన్స్ అయిపోయాయి,”మా” కు ఎంతో చేయాలని,ఎన్నో కలలు, ఆశలతో ఎన్నికల్లో పోటీ చేశాం.కానీ గత రెండ్రోజుల్లో జరిగిన సంఘటనల గురించి కలసి చర్చించాం.ఎలక్షన్ మొదలు అయినప్పటి నుంచి ఏదో ఒక సమస్య వస్తునే వుందన్నారు..ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్,పైకి కన్పించని రౌడీయిజం,పోస్టల్ బ్యాలెట్‌లో అన్యాయం జరిగిందన్నారు..అయినా ఎన్నికను ఆపొద్దని అనుకున్నమన్నారు..ఓట్ల కోసం ఎక్కడెక్కడి దూరం నుంచి మనుషులను తీసుకొచ్చారని,,మోహన్ బాబు వచ్చి కూర్చున్నారని చెప్పారు..అయినా సీనియర్ నటుడైన బెనర్జీ మీద చేయి చేసుకున్నారు.అసభ్య పదజాలాన్ని వినియోగించారు. ఎలక్షన్లు జరిగిన రోజు పూర్తి ఫలితాలు వెల్లడించలేదని,,అయితే ఆ రాత్రికి ఈసీ రిజల్ట్స్‌ను పక్కన పెట్టడంతో పాటు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో లెక్కలు మారాయన్నారు.ముందు రోజు గెలిచిన వారిని తర్వాతి రోజు ఓడిపోయారనడంతో ఆశ్చర్యం వేసిందని చెప్పారు..అందరినీ కలుపుకుని పోదామని అంటూనే జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ పోస్టులు తమ ప్యానెల్‌కే అన్నారు.ఇలాంటి మాటలు మమ్మల్ని బాధించాయని,ఆ మాటలతో కలుపుకుని పోయే పరిస్థితి కనిపించడం లేదని చెప్పుకొచ్చారు..మా ప్యానెల్ నుంచి గెలిచిన తమ ప్యానెల్ సభ్యులు అక్కడ పని చేయగలరా అంటు వారు సందేహాలు లేవనెత్తారన్నారు. ‘మా’ ఎన్నికల్లో తమ ప్యానెట్ నుంచి గెలించిన 11 మంది అక్కడ ప్రశ్నించడం వల్ల ‘మా’ సంక్షేమం ఆగిపోతాయేమోనని అనుమానలు వ్యక్తం చేస్తున్నరన్నారు..అందుకే మేం ఓ రావడం జరిగిందని,,వచ్చే రెండు సంవత్సరాల్లో మంచు విష్ణు బాగా పని చేయాలి,ఆయన పెద్ద హామీలు ఇచ్చారు. దానికి అడ్డురాకూడదు. ‘మా’ సంక్షేమం కోసం సినిమా బిడ్డల ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నరని తెలిపారు..

 

Spread the love