Recent Posts

బీర్ల ధరలను 30 శాతం తగ్గించి రాజస్తాన్ ప్రభుత్వం

అమరావతి: ఎండకాలంలో చల్ల చల్లని బీర్ తాగాలనుకునే మద్యం ప్రియులకు రాజస్తాన్ ప్రభుత్వం కూలింగ్ కబురు అందిచింది..ప్రస్తుతం 650 ml బీరు బాటిల్ ధర రూ.100 నుంచి 150 ఉంటుండడంతో,, మందుబాబులు బీరును పెద్దగా పట్టించుకోవడంలేదు..దింతో ఒకటిన్నర కోటి కేసుల బీరు ఆమ్మకాలు తగ్గిపోయాయి.. 2019-20 సంవత్సరంలో 2 కోట్ల 65 లక్షల బీర్ల కేసులు అమ్ముడు పోగా,, 2020 -21 సంవత్సరంలో ఆ సంఖ్య ఒక కోటి 60 లక్షలకు తగ్గింది..కేవలం 95 లక్షల బీర్ల కేసులు మాత్రమే అమ్ముడు పోయాయి.. బీర్ల రేట్లపై అదనపు ఎక్సైజ్ సుంకం,,కొవిడ్ సర్ ఛార్జీ పెంచడంతో బీర్ల అమ్మకాలపై ప్రభావం పడింది..ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం గండి పడింది.. ప్రభుత్వ ఖజానాకు భారీగా రెవెన్యూ తగ్గడంతో బీర్ల అమ్మకాల విషయంలో ఎక్సైజ్ పాలసీలో స్వల్ప మార్పులు తీసుకొచ్చింది.. కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం..బీర్ల ధరలు రూ.30 నుంచి రూ.35 వరకు తగ్గనున్నాయి..బీర్ బ్రాండ్ ను బట్టి ధరలు మారనున్నాయి.. బీర్ల అమ్మకాలను పెంచి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలాగా కొత్త ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేశారు.. దీని ప్రకారం వాటి MRP ధరలపై అదనపు ఎక్సైజ్ సుంకం,,కొవిడ్ సర్ ఛార్జీని తగ్గించారు..ధరలు తగ్గడంతో మండే వేసవి బీర్ల ప్రియులు మళ్లీ బీర్ల కొనుగొలుకు మొగ్గు చూపే ఆవకాశం మెండుగా వుంది..మరి కాదంటా ??

Spread the love