Recent Posts

టీడీపీ, జనసేన దగ్గర అవుతుందనే ప్రశ్నఉహాజనితమైనది-సోము

అమరావతి: 2024లో జనసేన, బీజేపీ కలిసే పోటీ చేస్తాయని, ఎలాంటి అనుమానాలు ఇందులో లేవని, జనసేన పార్టీతో పొత్తుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యనించారు.మీడియాతో అయన మాట్లాడుతూ జనసేనకి ఒక పాలసీ ఉందని,తమకు ఒక పాలసీ ఉందన్నారు..బిజెపి కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించదని,,అందుకే బద్వేల్‌ లో పోటీ చేస్తున్నామని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు భిన్న అభిప్రాయాలు సాధారణమని,జనసేనతో మిత్ర పక్షంగా కొనసాగుతామని ప్రకటించారు.చనిపోయిన అభ్యర్థి భార్యకి నామినేటెడ్ పదవి ఇవ్వవచ్చు కదా ? పోటిలో నిలపడం దేనికి అంటూ ప్రశ్నించారు..బద్వేల్‌ ప్రచారానికి పవన్ ని ఆహ్వానిస్తామని,అయన వస్తారని ఆశిస్తున్నామన్నారు. టీడీపీ, జనసేన దగ్గర అవుతుందనే ఉహాజనితమైన ప్రశ్నపై తాను ప్రస్తుతానికి ఏమి వ్యాఖ్యనించలేన్నన్నారు..చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దు అన్నాడు అందుకే ఇవ్వలేదని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు…

Spread the love