Recent Posts

ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ ను ఈ నెల 27న ప్రధాని ప్రారంభిస్తారు-కేంద్ర మంత్రి

అమరావతి: దేశవ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్ధాయిలో ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ పేరుతో అమలు చేసే ఈ కార్యక్రమాన్నిఈ నెల 27న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించనున్నారని ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు.ఇందులో ప్రతీ పౌరుడికీ హెల్త్ కార్డుల జారీతో పాటు వారి ఆరోగ్య సమాచారాన్ని అందులో నిక్లిప్తం చేయబోతున్నారు.దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ అమలు చేయబోతున్నట్లు గత ఏడాది ఆగస్టు 15న ప్రధాని మోడీ ప్రకటించారు.ఇందులో భాగంగా దేశంలోని పౌరులందరికీ హెల్త్ కార్డులతో పాటు హెల్త్ ఐడీ కూడా అందిస్తారు.భవిష్యత్తులో ఎప్పుడైనా జబ్బు చేసినప్పుడు చికిత్స అందించాల్సి వచ్చినా, మందులు తీసుకోవాల్సి వచ్చినా దానికి ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఉపయోగపడుతుంది. జాతీయ డిజిటల్ హెల్త్ మిషన్ లో భాగంగా అమలు చేసే ఈ కార్యక్రమాన్ని ముందుగా పైలట్ విధానంలో ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేయబోతున్నారు. పుదుచ్చేరి, చండీఘడ్, లడఖ్, లక్షద్వీప్, అండమాన్, నికోబార్ దీవులు, డామన్ ,డయ్యూ, దాద్రానగర్ హవేలీలో అమలు చేస్తారు.ఆ తర్వాత దేశంలోని మిగిలిన కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు విస్తరిస్తారు.దీంతో క్రమంగా డిజిటల్ హెల్త్ మిషన్ సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రాబోతున్నాయి..

Spread the love