అమరావతి: శ్రీలంకలో ప్రజాందోళనలు,,విపక్షాల నిరసనలు తీవ్రం కావడంతో ప్రధాని రాజపక్స రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఆయన పేరిట సోమవారం ప్రకటన వెలువడింది. శ్రీలంక ప్రజలు తీవ్ర భావోద్వేగంతో ఉన్నారని, హింసతో సాధించేది శూన్యమని పేర్కొన్నారు.. ప్రజలు సంయమనం పాటించాలని, ఆర్ధిక సంక్షోభానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు..ఆర్థిక సంక్షోభం, పెరిగిన నిత్యావసర వస్తువులు, పెట్రో ధరలతో దేశ ప్రజలు గత కొంతకాలం నుంచి తీవ్రస్థాయిలో నిరసనలకు దిగారు..ప్రస్తుతం తలేత్తిన సంక్షోభం తమ ప్రభుత్వ నిర్ణయాల వల్ల కాదని, కోవిడ్ మూలంగా ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని విదేశీ మారక నిల్వలు కరిగిపోయాయని రాజపక్స ప్రభుత్వం వాదన విన్పిస్తు వస్తోంది..
Sri Lankan Prime Minister Mahinda Rajapaksa resigns: Local media#SriLanka
(file pic) pic.twitter.com/PWAkZGGVms
— ANI (@ANI) May 9, 2022