Recent Posts

క్రీడాకారులకు ఖేల్ రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి

అమరావతి: రాష్ట్రపతి రామ్‌నాథ్, కోవింద్ వివిధ క్రీడల్లో అత్యున్నత స్థాయి విశేష ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న పురస్కారాలను ప్రదానం చేశారు..శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది..2021 మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న పురస్కారాలకు 12 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు..ఇండియన్ జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా, టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలు రవి కుమార్ (రెజ్లింగ్), లొవ్లీనా బోర్గోహాయిన్ (బాక్సింగ్), పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, శ్రీజేష్ పీఆర్ (హాకీ), టోక్యో పారాలింపిక్స్ పతక విజేతలు అవని లేఖరా (షూటింగ్), సుమిత్ అంతిల్ (జావెలిన్), ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్), కృష్ణ నగర్ (బ్యాడ్మింటన్), మనీష్ నర్వాల్ (షూటింగ్), మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, పురుషుల ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛేత్రిలను ఈ పురస్కారాలను అందుకున్నారు..హాకీ ప్లేయర్లు మోనిక, వందన కటారియా,కబడ్డీ ప్లేయర్ సందీప్ నర్వాల్, షూటర్ అభిషేక్ వర్మలకు అర్జున పురస్కారాలను ప్రదానం చేశారు..

Spread the love
error: Content is protected !!