Recent Posts

గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన పాజిటివిటీ రేటు 0.84 శాతం-కేంద్ర ఆరోగ్యశాఖ

అమరావతి: దేశంలో కరోనా వైరస్ క్రమేపీ పెరుగుతున్న సూచనలు కన్పిస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 3.02 లక్షల మందికి వైరస్ పరీక్షలు చేయగా 2,541 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని,, రోజువారీ పాజిటివిటీ రేటు 0.84 శాతంగా ఉందని పేర్కొంది..కొన్ని రోజులుగా కొత్త కేసులు 2 వేలకు పైగానే నమోదవుతుండడం మరో వైపు గత వారం రోజుల నుంచి 12 రాష్ట్రాల్లో కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి..కొత్త కేసుల కంటే రికవరీలు తక్కువగా ఉండడంతో క్రియాశీల కేసుల సంఖ్య 16 వేలు దాటింది.. ఇదే సమయంలో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది..నిన్న ఒక్క రోజే 3.64 లక్షల మంది టీకాలు వేయించుకున్నారు..ఇప్పటి వరకు 187 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

Spread the love
error: Content is protected !!