Recent Posts

కలెక్టర్ కార్యాలయం మూసివేత అంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదు-కలెక్టర్

నెల్లూరు: నెల్లూరు కలెక్టర్ తో పాటు కార్యాలయంలో 20 మందికి కరోనా-కార్యాలయం మూసివేత అంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు వాస్తవం కాదని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఒక ప్రకటనలో ఖండించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్,వారి కార్యాలయం పై వస్తున్న దుష్ప్రచారం పట్ల కలెక్టర్ వెంటనే స్పందిస్తూ తాను మూడు  డోసుల కోవిడ్ టీకాలు వేసుకొని సురక్షితంగా ఉన్నానని తనకు  కరోనా సోకలేదని స్పష్టం చేశారు.అలాగే తన కార్యాలయంలో  ఎవరికి  కరోనా సోక లేదని అందరూ ఆరోగ్యంగా ఉన్నారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.అలాగే తన కార్యాలయం గాని,  క్యాంపు కార్యాలయం గాని మూసేశారు అనడం నిజం కాదన్నారు.సంక్రాంతి పండుగ సందర్భంగా వరుసగా ప్రభుత్వ సెలవులు అయినందున గతంలో సెలవుదినాల్లో లాగానే యధావిధిగా సిబ్బందితో కార్యాలయం పనిచేస్తుందన్నారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా ప్రజలందరూ మాస్కు ధరించడం,శానిటైజర్ వాడటంతో పాటు సామాజిక దూరం పాటించి సంక్రాంతి వేడుకలు జరుపుకుంటూ మూడవ వేవ్ కోవిడ్ ముప్పు నుండి  సురక్షితంగా ఉండాలని కోరారు.

Spread the love
error: Content is protected !!