Recent Posts

వాన నీటిలో చిక్కుకుని నవ వధువు మృతి

తిరుపతి: తిరుపతి పట్టణంలో శుక్రవారం రాత్రి  వర్షపు నీటిలో మునిగి నవ వధువు కన్నుమూసిన విషాద సంఘటన చోటు చేసుకుంది..రాత్రి కురిసిన భారీ వర్షాలతో నగరంలో పలు లోతట్టుప్రాంతాలు,,రహదారులు జలమయమయ్యాయి.కర్ణాటకలోని రాయచూర్ కు చెందిన కుటుంబ సభ్యులు పెళ్లి అయిన తరువాత నూతన వధూవరులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి తుపాన్ వాహనంలో బయలు దేరి తిరుపతి వచ్చారు..తిరుపతి వచ్చే సమయానికి భారీ వర్షాలు కురిసి పలు లోతట్టు ప్రాంతాల జలమయమయ్యాయి. అక్కడ అప్పటికే 8 అడుగుల ఎత్తులో నీరు నిలిచిపోయింది.ఈ నేపధ్యంలో వారు వస్తున్న తుఫాన్ వాహనం తిరుపతి బాలాజీ కాలనీ నుంచి యం.ఆర్.పల్లి కి వెళ్లే దారిలో వెంగమాంబ కూడలి పడమట రైల్వే అండర్ బ్రిడ్జి ప్రాంతంలో లోతు తెలియని డ్రైవర్ సురక్షితంగా వెళ్లిపోవచ్చనే ధీమాతో వాహనాన్ని వేగంగా నీళ్లలోకి పోనిచ్చాడు..ఎంత వేగంగా పోనిచ్చినా ఇంజన్ లోకి నీరు చేరటంతో తుపాను వాహనం బ్రిడ్జిలోని నీటి మధ్యలో అగిపోయింది.వాహనంలో వారు తేరుకునే సరికి తుపాను వాహనం నీటిలో మునిగిపోయింది..స్థానికుల నుంచి సమాచారం అందుకున్న S.V యూనివర్సిటీ పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి వాహనంలో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు.అయితే ఈలోపే వాహనంలో ప్రయాణిస్తున్న నవవధువు సంధ్య అక్కడికక్కడే నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందింది.మరో ఇద్దరి పరిస్ధితి విషమంగా మారడంతో,వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు..

Spread the love
error: Content is protected !!