Recent Posts

శానిటైజర్ ఒంటిపై పోసుకుని తల్లి,బిడ్డ ఆగ్నికీ అహుతి

నెల్లూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో సుబ్బమ్మ అనే మహిళ తన కూతురుతో కలసి శానిటైజర్ ఒంటిపై పోసుకుని అగ్నికీ ఆహుతి కావడం జరిగిందని ఆత్మకూరు S.I రవినాయక్ చెప్పారు..శుక్రవారం జరిగిన సంఘటనపై S.I రవినాయక్ అందించిన వివరాలు ఇలా వున్నాయి..బళ్లారిలో నివాసం వుంటున్న నెల్లూరుకు చెందిన సుబ్బులు(27) అనే మహిళ,తన ఇద్దరు పిల్లలతో కలిసి గురువారం రాత్రి బళ్లారి నుంచి నెల్లూరుకు వచ్చేందుకు ప్రవేట్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరింది..శుక్రవారం వేకువజామున 3.30 గంటల సమయంలో బస్సు ఆత్మకూరు పరిధిలోని నెల్లూరు పాళెం వద్దకు చేరుకోగానే అక్కడే దిగిపోయింది..సుబ్బులు,తన కుమార్తె మధురవాణి (5),,కుమారుడు మహేష్(10)తో కలసి నెల్లూరుపాళ్లెంరోడ్డు ప్రక్కనను తుమ్మచెట్ల పోదల్లోకి చేరుకుని,,తన పాటు తెచ్చుకున్న శానిటైజర్ ను తనతో పాటు పిల్లలు ఇద్దరిపై పోసి,నిప్పు అంటిచుకుంది..మంటలను చూసిన బయపడిన మహేష్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి,రోడ్డుపై వెళ్లుతున్న స్థానికులు తెలిపారు.. విషయం గమనించిన వారు పోలీసులకు సమచారం అందిందచారని S.I తెలిపారు..మంటల్లో సుబ్బులు,అమె కూతురు మధురవాణీలు మరణించారని,,కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నమని తెలిపారు..

Spread the love