Recent Posts

సీ.ఎం రిలీఫ్ ఫండ్ కు 1.5 కోట్లు అందచేసిన మంత్రికి నెల్లూరుజిల్లా అవసరం కన్పించ లేదా-ఆనం

ఆక్సిజన్ జనరేటర్ కోసం సోనూసూద్ సహాయం..

నెల్లూరు: జిల్లాలోని కరోనా బాధితులకు ఆక్సిజన్ అందించేందుకు అక్సిజన్ జనరేటర్ ఏర్పాటు చేయమని,,సోనుసూద్ ని సహాయం అడుగుతున్నరంటే,,జిల్లాలో వున్నమంత్రలు,ఎమ్మేల్యేలు,నాయకులు ఏమైయ్యారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి వైసీపీ నాయకులను నిలదీశారు..మంగళవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ సోనూసూద్ పెద్ద కోటేశ్వరుడు కాదు,ఆస్తులు తాకట్టు పెట్టి కరోనా సమయంలో ప్రజలకు సహాయం చేస్తున్నాడు అంటే నిజంగా ఆయన అభినందించాలన్నారు..నెల్లూరు జిల్లాకి ఆక్సిజన్ జనరేటర్ ఇస్తున్నారని వార్తల్లో చూసిన తరువాత అయన దాతృత్వానికి సంతోష వేసిందని,,అదే సమయంలో జిల్లాలో ఇంత మంది పెద్ద నాయకులు వుండి కూడా రూ.1.5 కోట్ల రూపాయలతో అక్సిజన్ జనరేటర్ ఏర్పాటు చేయలేక  పోయారంటే అవమానంగా వుందన్నారు..ఎక్కడో  ముంబైలో ఉండే సోనుసూద్ అప్పు చేసి నెల్లూరు జిల్లాకి సహాయం చేస్తున్నాడని,,4 రోజులు క్రిందట 1.50.00.000 మీరు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చారు కదా,, ఏం మీకు నెల్లూరు జిల్లా కనిపించ లేదా ? నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ లేదని తెలీదా ? ఆ డబ్బు ఇక్కడ పెట్టలేరా ? 1.5 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ కింద డబ్బులు అందచేస్తారు కాని ? ఇక్కడ ప్రజలు చచ్చిపోయినా పర్వాలేదా ? ఇదేమి న్యాయం అంటు మంత్రి గౌతమ్ రెడ్డిని ప్రశ్నించారు.. ఇండస్ట్రియల్ మినిస్టర్ అయిన మంత్రి గౌతమ్ అడిగితే నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సైజ్,, మేనకూరు సెజ్,, శ్రీ సిటీ సెజ్ లు,,CSR Funds corporate social responsible క్రింద అక్సిజన్ జనరేటర్ ను ఏర్పాటు చేస్తారుగా ?మరి ఎందుకు మీరు ఈ ప్రయత్నం చేయలేదని నిలదీశారు..జర్మన్ టెంట్ కట్టేసాం,,మలేషియా బెడ్లు పెట్టాం,, సింగపూర్ ఫ్యాన్లు పెట్టామని మంత్రులు మాట్లాడడం విడ్దూరంగ వుందని,,V.R. కాలేజ్,,D.K.W కాలేజ్,, సర్వోదయ కాలేజ్ లు వుండగా జర్మన్ టెంట్లు ఏర్పాటు చేయడం ఏమిటిన్నారు..అందుబాటులో ఉన్న కాలేజీలు వాడుకోకుండా,,దేవాలయలను ఎందుకు ఉపయోగిస్తున్నరు ? జొన్నవాడ కామాక్షమ్మ గుడిలో 20 రూమ్ లు  ఉంటాయి,,రంగనాయకుల స్వామి ఆలయంలో అసలు రూములు ఉన్నాయా అంటు ప్రశ్నించారు..కాలేజీలు,,TIDCO ఇళ్లకి గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టాలి కానీ గుడిలో క్యారంటైన్ సెంటర్ పెడితే ఎండోమెంట్స్ డబ్బులు వాడుకోవచ్చని ఆలోచనతోనే మీరు ఈ పనిచేయడం క్షమించరానిదన్నారు..

Spread the love