Recent Posts

భూహక్కు-భూరక్ష కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి-మంత్రుల కమిటీ

అదనంగా డ్రోన్ లను వినియోగించాలి..

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 52 డ్రోన్ లతో సమగ్ర భూసర్వే కార్యక్రమం నిర్వహిస్తున్నామని,, త్వరలోనే సర్వే ఆఫ్ ఇండియా, ఎపి ప్రభుత్వం, ప్రైవేటు ఏజెన్సీల ద్వారా మొత్తం 172 డ్రోన్ లను సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు మంత్రుల కమిటీకి తెలిపారు..శుక్రవారం సచివాలయంలో శుక్రవారం రాష్ట్ర ఇంధన, అటవీ, గనులు, పర్యావరణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జగనన్నభూహక్కు-భూరక్ష పథకంపై మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స,,రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన,, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు అజేయ్ కల్లాంతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు..ఈ సందర్భంగా అధికారులు భూసర్వేకు సంబంధించి జరుగుతున్న ప్రగతిని కమిటీకి వివరిస్తూ ఇప్పటి వరకు 2149 గ్రామాల్లో డ్రోన్ సర్వే జరిగిందని తెలిపారు. అలాగే 756 గ్రామాలకు గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయ్యింది. 535 గ్రామాల్లో గ్రౌండ్ వ్యాలిడేషన్ పూర్తి చేశామని,,వీటికి సంబంధించి 9283 అప్పీళ్ళు ప్రజల నుంచి అందాయని, వాటిల్లో 8935 అప్పీళ్ళను పరిష్కరించడం జరిగిందని అన్నారు. సర్వే చేసిన 51 గ్రామాల పరిధిలో సర్వే రాళ్ళను పాతడం కూడా వేగంగా జరుగుతోందని అన్నారు. ఇప్పటి వరకు 18,487 సర్వే రాళ్ళను పాతడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు 13 జిల్లా కేంద్రాల్లో ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా సర్వే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెడుతున్నామని, ఈ జూన్ నాటికి మరో 13 జిల్లా కేంద్రాల్లో ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్ని జిల్లాల్లో ఆగస్టు నాటికి డ్రోన్ సర్వే ప్రారంభమవుతుందని, అప్పటికి రాష్ట్రం మొత్తం మీద 100 ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని అన్నారు.

Spread the love
error: Content is protected !!