Recent Posts

ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీంకు జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంగా పేరు ఖరారు

అమరావతి: ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి రుణాలు తీసుకున్న వారికి ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకం క్రింద జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంగా పేరును అధికారులు ఖరారు చేశారు.సోమవారం గృహనిర్మాణశాఖ అధికారులతో క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించిన సందర్బంలో అధికారులు సీ.ఎంకు వివరాలు తెలియ చేస్తు,సెప్టెంబరు 25 నుంచి ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ డేటాను అప్‌లోడ్‌ చేయనున్నదన్నారు. వివిధ సచివాలయాలకు ఈడే టాను పంపించడం జరుగుతుందని,క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలన చేపట్టడతరన్నారు.గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఒన్‌టైం సెటిల్‌మెంట్‌పథకం సొమ్మను చెల్లించేలా వెసులుబాటు,ఒన్‌టైం సెటిల్‌మెంట్‌కు అర్హులైన వారి జాబితాలు ఖరారైన తర్వాత నిర్దేశిత రుసుము చెల్లింపుతో వారికి ఇంటిపైన, స్థలాలపైన పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు వుంటాయని సీ.ఎంకు తెలిపారు.ఓటీఎస్‌ పథకం అమలుకు గ్రామ, వార్డు సచివాలయాలు పాయింట్‌గా ఉండాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగేలా చర్యలు తీసుకోవాలని,ఈమేరకు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.లబ్ధిదారులు ఎంచుకున్న ఆప్షన్‌ 3 కింద ప్రభుత్వమే కట్టించనున్న ఇళ్ల నిర్మాణ పనులు అక్టోబరు 25 నుంచి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Spread the love