సింగల్స్,డబుల్స్ లో విన్నర్స్..
అమరావతి: భారత యువ షట్లర్ లక్ష్యసేన్ Yonex-Sunrise India Open 2022 ఆదివారం KD Jadhav Indoor Hall, Delhiలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సింగపూర్ ఆటగాడు, వరల్డ్ ఛాంపియన్ లొహ్ కియన్ యూని 24-21, 21-17 స్కోరు తేడాతో ఓడించి చరిత్ర సృష్టించాడు.. లక్ష్యసేన్కు ఇదే తొలి బంగారు పతకం..అలాగే ఈ టైటిల్ను గెలుచుకున్న మూడో ఆటగాడిగా లక్ష్యసేన్ నిలిచాడు.ఇతని కంటే ముందు 1981లో ప్రకాష్ పదుకొణె,,ఆ తర్వాత 2015లో కిదాంబి శ్రీకాంత్ తొలి సూపర్ 500 ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకున్నారు..ఈ మ్యాచ్లో ప్రపంచ చాంపియన్ ముందు లక్ష్యసేన్ తొలి నుంచి అధిపత్యం కనబరస్తు, కేవలం 54 నిమిషాల్లో విజయం సాధించాడు. గత ఏడాది ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్య పతకాన్ని సాధించి లక్ష్య సేన్,భారతీయ క్రీడాభిమానుల మద్దతు చూరగొన్నారు..ఈ టైటిల్ ప్రైజ్ మనీ క్రింద $400,000 అందుకోనున్నాడు..అలాగే పురుషుల డబుల్స్ విభాగంలోనూ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి కలిసి ఇండోనేషియన్ జంటను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నారు.
డబుల్స్ ఛాంపియన్స్: భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి కూడా చరిత్ర సృష్టించారు.తొలిసారిగా ప్రతిష్ఠాత్మక ఇండియా ఓపెన్ టైటిల్ను సొంతం చేసుకున్నారు.ఆదివారం జరిగిన ఫైనల్లో మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్లు అయిన ఇండోనేసియా జోడి మోహమ్మద్ అహసన్-హెంద్రా సెతియావాన్లపై హోరాహోరీగా పోరాడి ఘన విజయం సాధించారు..