Recent Posts

అమూల్ ఒప్పందంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

అమరావతి: అమూల్ ఒప్పందంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జ‌రిపిన హైకోర్టు,,మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది..నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు,,గుజరాత్‌లోని అమూల్‌ సంస్థకు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది..అలాగే అమూల్‌తో కుదుర్చుకున్నఅవగాహన ఒప్పందంపై,,ఎలాంటి నిధులు ఖర్చు చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది..త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది..APDDF ఆస్తులను లీజు పద్ధతిలో అమూల్ సంస్థకు బదిలీ చేస్తూ సీఎం జగన్ అధ్యక్షత కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో రఘురామ కృష్ణంరాజు సవాల్ చేశారు..ఈ నిర్ణయాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించి,,ఒప్పందంను రద్దు చేయాలని కోరారు..దీనిపై నేడు విచార‌ణ జరిపిన హైకోర్టు,,మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది..ఇదే సమయంలో గోదావరి జిల్లాల్లో అమూల్‌ పాలసేకరణను సీఎం వైఎస్ జ‌గ‌న్ ఈ రోజే ప్రారంభించారు..పాడి రైతులకు పెద్ద ఎత్తున లాభాలు ఇస్తారని,,అమూల్ పైసా కూడా లాభం తీసుకోకుండా రైతుల కోసం పని చేస్తుందని వెల్ల‌డించారు..

Spread the love