Recent Posts

అమెరికా కరోనా కష్టంలో వున్న సమయంలో భారత్ చేసిన సాయం ఎన్నటీకి మరువలేం-బ్లింకెన్

అమరావతి: కోవిడ్-19 అమెరికాపై విరుచుకుని పడిన తరుణంలో భారతదేశం మాకు అండగా నిలచిందని,భారత్ చేసిన సాయం అమెరికా ఎన్నాటికీ మరువదని అమెరికా విదేశాంగాశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు..శుక్రవారం అమెరికా పర్యటనలో వున్న భారత విదేశంగా శాఖ మంత్రి జైశంకర్ తో సమావేశమైన సందర్బంలో అయన మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తో ఇబ్బందులు పడుతున్న భారత్ కు అన్ని విధాలుగా అండగా వుంటామన్నారు..అలాగే పలు అంశాల్లో ఇండియా,అమెరికాలు పరస్పర సహకారంతో ముందుకు సాగుతాయని పేర్కొన్నారు..అమెరికా నూతన అధ్యక్షడుగా బైడెన్ పాలన మొదలైన తరువాత అమెరికాలో భారతదేశం నుంచి పర్యటించిన తొలి క్యాబినెట్ మంత్రి జైశంకర్ కావడం విశేషం..ఇదే సమయంలో అమెరికా రక్షణశాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తో జైశంకర్ సమావేశం అయ్యారు..భారత్,,అమెరికాల మధ్య రక్షణ,వ్యూహాత్మక సంబంధాలను భవిష్యత్ లో మరింత బలోపేతం చేసే దిశగా వీరిద్దరి మధ్య చర్యలు జరిగినట్లు సంబంధిత వర్గాలు  పేర్కొన్నాయి..కరోనా కష్ట కాలంలో భారత్ కు అమెరికా అండగా నిలిచినందుకు జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు..

Spread the love