Recent Posts

బంగారు నగలపై నేటి నుంచి హాల్ మార్క్ గుర్తు తప్పని సరి

అమరావతి: బంగారంలో కల్తీ చేయడాన్ని అరికట్టేందుకే ఈ కొత్త నిర్ణయం అమలులోకి వచ్చింది. పలువురు బంగారు వ్యాపారస్తులు తిమ్మిని బమ్మి చేస్తు ఆకర్షణీయమైన పేర్లు, స్కీములతో నకిలీ బంగారం,,కల్తీ బంగారు నగలను వినియోగదారులకు అంటకడుతున్నారు అనేది బహిరంగ రహస్యమే..వ్యాపారస్తులను నిలతీయాలంటే,, సామాన్యులు కనిపెట్టలేని రీతిలో బంగారు నగలను కల్తీ చేస్తుండడంతో ఏది అసలో,, ఏది నకిలీయో వినియోగదారులు గుర్తించలేని పరిస్థితి నెలకొంది..ఈలాంటి పరిస్థితులను నుంచి వినియోగదారులను రక్షించేందుకు బంగారు నగలకు ఇక నుంచి హాల్ మార్కింగ్ తప్పనిసరి చేస్తు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేటి నుంచి అమలులోకి వచ్చింది..2021 జనవరి 1 నుంచే ఈ కొత్త విధానం అమల్లోకి రావాల్సి ఉండగా, కరోనా కారణంగా తాము ఇంకా సన్నద్ధం కావాలేకపోయామని వ్యాపారస్తులు అభ్యంతరం చెప్పడంతో గడువును ఈనెల 1 వరకు పొడిగించారు.. అయితే మళ్లీ కరోనా ఉధృతి లాక్డౌన్ అమలు చేయడంతో ఈ నిర్ణయాన్ని మరో ఏడాది పాటు వాయిదా వేయాలని నగల వ్యాపారుల సంఘాలు మళ్లీ ప్రభుత్వాన్ని కోరాయి..ఇందుకు కేంద్రం ససేమిరా అంటూ కేవలం 15 రోజలు మాత్రమే గడువు పొడిగించింది..సదరు గడువు జూన్ 14వ తేదితో ముగిసిన నేపధ్యంలో మంగళవారం నుంచి అమలు చేయాలని స్పష్టం చేస్తోంది.. ప్రభుత్వ నిర్ణయంతో 2021 జూన్ 15వ తేది నుంచి 14, 18, 22 క్యారెట్ల మూడు కేటగిరీల నగలను ‘హాల్‌మార్క్‌’ గుర్తు ఉన్నవి  మాత్రమే వ్యాపారస్తులు అమ్మాల్సి ఉంటుంది..వినియోగదారులు బంగారు నగలు కొనుగొలు చేసే సమయంలో హాల్ మార్కు గుర్తు ఉందో లేదో అనే విషయం ఖచ్చితంగా చెక్ చేసుకొవాలి..లేదంటే మోసం తప్పదు… 

Spread the love