Recent Posts

శాసన మండలిని రద్దు నిర్ణయం వెనక్కు తీసుకున్న ప్రభుత్వం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం శాసన మండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానాన్ని వెనక్కు తీసుకున్నది..ఈ మేరకు శాసనమండలిని రద్దు చేస్తూ 2020 జనవరి 27న చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటూ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా,,ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ  అమోదించింది..మండలి రద్దు నిర్ణయం తర్వాత సందిగ్ధత నెలకొందని, అందుకే సందిగ్ధతను తొలగించేందుకు మండలిని రద్దు చేయాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపి 22 నెలలు అయిందని,తీర్మానం కేంద్రం వద్దే ఉండిపోయిందని బుగ్గన తెలిపారు.శాసనమండలి రద్దుపై స్పష్టత కోసం గతంలో చేసిన మండలి రద్దు తీర్మానాన్ని రద్దు చేస్తున్నట్లు వివరించారు.

Spread the love
error: Content is protected !!