Recent Posts

వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాల అదుకుంటంది-మంత్రి బాలినేని

నెల్లూరు: -జిల్లాలోని వరద బాధితులను అన్నివిధాల ఆదుకుంటామని రాష్ట్ర విద్యుత్తు అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రివర్యులు జిల్లా ఇన్చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.సోమవారం మంత్రి అనిల్ కుమార్,జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబులతో కలసి ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించారు.   తొలుత వారు నెల్లూరు నగరం శివార్లలోని భగత్ సింగ్ నగర్ కాలనీ, అహ్మద్నగర్, నెల్లూరు గ్రామీణ ప్రాంతంలోని పొట్టే పాలెం గ్రామాలను పరిశీలించారు.వారు భగత్ సింగ్ నగర్ కాలనీలో చుట్టూ కలియతిరిగి ఉధృతంగా  ప్రవహిస్తున్న పెన్నా నదిని పరిశీలించారు.వరద నీరు తగ్గడంతో కాలనీకి తిరిగి వచ్చిన ప్రజలతో మంత్రులు మాట్లాడారు.బాధితులను మంత్రులు ఓదార్చి ప్రభుత్వం తరఫున ఐదు లక్షల రూపాయల బ్యాంకు చెక్కును పరిహారంగా వారికి అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ జిల్లాలోని 20 మండలాల్లో 47 వేల మంది నిరాశ్రయులు కాగా వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించి మంచినీరు, ఆహారము తదితర సదుపాయాలు కల్పించామన్నారు.ముఖ్యమంత్రి వెంటనే స్పందించి వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారన్నారు.వార్డు, గ్రామ సచివాలయాల పరిధిలో కార్యదర్శులు, వాలంటీర్లు ద్వారా ప్రతి కుటుంబానికి 5800 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఉచితంగా 25 కిలోల బియ్యము, ఒక కిలో కందిపప్పు, ఒక కిలో ఉల్లిపాయలు, ఒక లీటర్ పామాయిల్, ఒక కిలో ఆలుగడ్డలు పంపిణీ చేసేందుకు ఆదేశాలు ఇచ్చామన్నారు.అలాగే రైతులు వాళ్లు నష్టపోయిన పంటలకు కూడా ఎన్యూమెరేషన్ చేయించి నష్టపరిహారం తోపాటు ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు.

Spread the love
error: Content is protected !!