Recent Posts

రాష్ట్రంలో అన్ని వనరులను ప్రభుత్వం తాకట్టు పెడుతుంది-పవన్

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణగాడి తప్పిందని, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు సకాలంలో ఇవ్వకపోతే ఎలా..? అంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు..వృద్ధాప్యంలో వున్న వారి వైద్య ఖర్చులకీ ఇబ్బందులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు..ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని,, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ గాడి తప్పడమే దీనికి కారణమన్నారు.. పోలీసుశాఖలో 11 నెలల నుంచి టీఏలు కూడా చెల్లించలేదని,,ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయడం లేదని విమర్శించారు..ప్రభుత్వ ఉద్యోగులు జీతం వస్తే అదే పదివేలు అనుకుంటారనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు..ప్రభుత్వం ప్రతి నెలా వేల కోట్ల రూపాయలు తీసుకుని వస్తున్న డబ్బులు ఎక్కడి పోతున్నాయి,,ఏమై పోతున్నాయి..? అంటూ ప్రశ్నించారు.. వైపీసీ ప్రభుత్వం అన్నీ రాష్ట్రంలో అన్ని వనరులను తాకట్టు పెడుతోందంటూ మండిపడ్డారు..ఎన్ని వాగ్దానాలు చేసినా, ఎన్ని అరుపులు అరిచినా,,రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా,, సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు… పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు,,ఈ మౌలిక ఆర్ధిక సూత్రాన్ని ‘వైసీపీ ప్రభుత్వం’ మరిచినట్టుంది సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేశారు..

Spread the love