Recent Posts

తొలి భూ ఉపగ్రహం స్పుత్నిక్ -1 ప్రయోగం 1957 అక్టోబరు4న జరిగింది-తమిళసై

నెల్లూరు: అంతరిక్ష రంగంలో ఇస్రో మన దేశం నిజంగా గర్వించదగ్గ గొప్ప సంస్థని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ శ్రీమతి తమిళసాయి సౌందరరాజన్ పేర్కొన్నారు సోమవారం ఉదయం నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట లో వెలసి వున్న శ్రీ చెంగాలమ్మ దేవస్థానాన్ని దర్శించుకుని పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వారు శ్రీహరికోటలోని షార్ సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం చేరుకుని అక్కడి ఎం.ఆర్.కే. ఆడిటోరియంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు-2021లో ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలలో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు.అంతరిక్ష పరిశోధన,అన్వేషణలో చాలా సంవత్సరాలుగా మనకు గొప్ప వారసత్వం ఉందన్నారు.  అంతరిక్ష రంగంలో ఇస్రో మనదేశం నిజంగా గర్వించదగ్గ గొప్ప సంస్థ అని ప్రశంసించారు.ఇస్రో అంచలంచలుగా ఎదిగి GSLV-MARK-3 ప్రయోగ స్థాయికి చేరుకుందన్నారు.ఇస్రో పితామహు లైన డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ప్రొఫెసర్ సతీష్ ధావన్,  డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తదితర దిగ్గజాలు అందించిన విశిష్ట సేవలను మరొకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వారందించిన స్ఫూర్తి, విశిష్ట సేవలు  అభినందనీయమన్నారు.డాక్టర్ విక్రమ్ సారాభాయ్ కన్న కలలను ప్రొఫెసర్ సతీష్ ధావన్ సాకారం చేశారన్నారు.1957 సంవత్సరం అక్టోబర్ 4వ తేదీన తొలిసారిగా మానవులు రూపొందించిన భూ ఉపగ్రహం స్పుత్నిక్ -1 ప్రయోగించిన దృష్ట్యా 1999 లో ఐక్యరాజ్యసమితి  జనరల్ అసెంబ్లీ అక్టోబర్ 4 నుండి 10వ తేదీ వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను జరపాలని ప్రకటించిందన్నారు.ఈ కార్యక్రమంలో షార్ అసోసియేట్ డైరెక్టర్ M.B.N మూర్తి, కంట్రోలర్ M.శ్రీనివాసులరెడ్డి, సంయుక్త కలెక్టర్ హరెందిర ప్రసాద్, అదనపు ASP శ్రీమతి వెంకటరత్నం పలువురు షార్ శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు..

Spread the love