Recent Posts

కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీకి ఎన్నిక గుర్తును కేటాయించిన ఎన్నికల కమిషన్

అమరాతి: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రారంభించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల కమిషన్ హాకీ స్టిక్, బాల్ సింబల్ ను తమకు కేటాయించారని అమరీందర్ వెల్లడించారు..పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది..పంజాబ్ అసెంబ్లీకి 117 స్థానాలు వుండగా,,ఎన్నికల సంఘం, ఫిబ్రవరి 14వ తేదిన ఒకే విడతలో ఇక్కడ ఎన్నికలు నిర్వహించనున్నది..కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంవత్సరం దగ్గరకు వస్తున్న సమయంలో నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూకు ప్రాధాన్యత పెంచి అమరీందర్‌ సింగ్ కు కావాలని ప్రాధాన్యత తగ్గించింది..అలాగే అమరీందర్‌ను అవమానపర్చే రీతీలో ముఖ్యమంత్రి పదవినుంచి తప్పించింది..దీంతో ఆయన సొంతంగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించారు..రాబోయే ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీపై,,లోక్ కాంగ్రెస్, బీజెపీ కూటమి పై చెయ్యి సాధిస్తాయా ? వేచి చూడాలి మరి…

Spread the love
error: Content is protected !!