Recent Posts

అమెరికాను వణికిస్తున్న డెల్టా వేరియంట్‌-రోజుకు 2 వేల మంది మృతి

అమరావతి: కరోనా వైరస్ భూతం అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తోంది..కేసులు తగ్గుతున్నట్లే కన్పించిన మళ్లీ విజృంభిస్తున్నాయి..ఓ వైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ప్రతిరోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి..వైరస్ బారిన పడి ప్రతి రోజూ 2 వేల మందికి పైగా మృతి చెందుతున్నారు..కరోనా కారణంగా శుక్రవారం ఒక్కరోజే 2,579 మంది మృతి చెందినట్లు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ వార్తను ప్రచురించింది..అలాగే గత వారంలో ప్రతిరోజూ సగటున 2,012 మంది మృతి చెందినట్లు పేర్కొంది..మరణాల సంఖ్య ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్‌, కాలిఫోర్నియా నుంచి అధికంగా నమోదు అవుతున్నట్లు గణాంకాలు చెప్పుతున్నాయి..సెప్టెంబర్‌ 13న అమెరికాలో 2.85 లక్షల కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి..క్రమేపీ ఈ సంఖ్య తగ్గుతూన్నట్లు కన్పించిన,గత శుక్రవారం 1.65 లక్షల మంది వైరస్‌ బారిన పడ్డారు..ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ మరణాలు మాత్రం 2వేలకు పైగా నమోదవుతుండటం ఆందోళన కలిగించే విషయమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.. 99 శాతం కేసులు డెల్టా వేరియంట్‌ కారణంగానే సంభవిస్తున్నాయని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం వెల్లడించింది.. అమెరికాలో ఇప్పటివరకు 54 శాతం ప్రజలు రెండు డోసుల వ్యాక్సీన్ వేసుకోగా 63 శాతం మంది మొదటి డోసు తీసుకున్నారు..

Spread the love