Recent Posts

కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ పై “కోవాగ్జిన్” వ్యాక్సీన్ ప్రభావవంతంగా పనిచేస్తుంది-ICMR

అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించేందుకు హైదరాబాద్ కి చెందిన భారత్ బయోటెక్ సంస్థ,,నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(NIV),ఐసీఎంఆర్ సహకారంతో అభివృద్ధి చేసిన “కోవాగ్జిన్”టీకా డెల్టా ప్లస్ వేరియంట్ పై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తమ తాజా అధ్యయనంలో తేలిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) సోమవారం తెలిపింది.మొత్తంగా కోవిడ్-19పై 77.8 శాతం సమర్థవంతంగా కోవాగ్జిన్ పనిచేస్తుందని,కొత్త కోవిడ్ డెల్టా వేరియంట్ పై 65.2 శాతం సమర్థంగా పనిచేస్తున్నట్లు గత నెలలో భారత్ బయోటెక్ ప్రకటించిన విషయం విదితమే..దేశంలో కోవిడ్ డెల్టా ప్లస్ కేసుల సంఖ్య 70కి పైగా ఉందని గత వారం కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్ లో ప్రకటించారు.

Spread the love