Recent Posts

కరోనాపై కొవాగ్జిన్ వ్యాక్సీన్ 77.8 శాతం సామర్థ్యాన్ని నిరుపించుకుంది-భారత్‌ బయోటెక్‌

అమరావతి: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ను నిలువరించాలంటే ప్రస్తుతం సమాజం ముదు వున్నఏకైక మార్గం వ్యాక్సినేషన్‌..దేశీయంగా రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నప్పటికి టీకాల కొరత కన్పిస్తుంది..టీకాల కొరతకు తగ్గించేందుకు విదేశీ వ్యాక్సిన్లకు కేంద్రం అనుమతులు ఇస్తోంది..అయితే వేటి సామర్థ్యం ఎంత ? ఇవి,డెల్టా వేరియంట్లపై ఏ మేర ప్రభావం చూపుతాయి అనే చర్చ సాగుతోంది..ఈ నేపథ్యంలో భారత్‌ బయోటెక్‌ సంస్థ,కోవాగ్జిన్‌ ఫేజ్‌-3 క్లినికల్‌ ట్రయల్స్‌ తుది ఫలితాలను విడుదల చేసింది..క్లినికల్ ట్రయల్స్‌ లో టీకా తీవ్రమైన,, మితమైన కేసుల్లో 77.8 శాతం సామర్థ్యాన్ని చూపినట్టు పేర్కొంది..అలాగే తీవ్రమైన కేసులపై 93.4 శాతం ప్రభావాన్ని చూపుతోందని,,ఇదే సమయంలో ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న బీ.1.617.2 (డెల్టా), బీ.1.351 (బీటా) వేరియంట్లపై 65.2 శాతం ప్రభావాన్ని ప్రదర్శిస్తోందని,,కోవిడ్ తీవ్ర లక్షణాలను నిలువరించి ఆస్పత్రిలోచేరే పరిస్థితులను తగ్గిస్తోందని,,కోవాగ్జిన్‌ మూడో దశ ట్రయల్స్ ఫలితాలను ప్రచురించిన భారత్‌ బయోటెక్‌ మెడ్‌జివ్ పేర్కొంది..భారత్‌లో జరిగిన అతిపెద్ద ట్రయల్‌లో కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ సురక్షితమైందని తేలినట్టు భారత్‌ బయోటెక్ పేర్కొంది..

Spread the love