Recent Posts

ఆర్యన్ ఖాన్‌కు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు

అమరావతి: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌కు ముంబై కోర్టు బెయిల్ నిరాకరించింది..NCB కస్టడీ ముగిసిన తరువాత కోర్టులో హాజరుపరిచగా,, ఆర్యన్‌ఖాన్‌ తరపున లాయర్ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.. ఆయన బెయిల్‌ పిటిషన్‌ ను కోర్టు పారేస్తూ..14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది..ఆర్యన్‌ ఖాన్‌ తో పాటు 7 గురిని.. జ్యుడీషియల్ కస్టడీకి పంపారు..ఆర్యన్‌ ఖాన్‌ను ఇన్నిరోజులు పాటు విచారించిన అవసరంలేదంటూ ఆయన తరుపున న్యాయవాది చెప్పిన కోర్టు తోసిపుచ్చింది. మరింత లోతుగా విచారణ జరపాలన్న.NCB అభ్యర్థనను కోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.ఆర్యన్‌ డ్రగ్స్ కేసులో షారుఖ్‌ ఇంతవరకూ స్పందించలేదు. ఆర్యన్‌ డ్రగ్స్ తీసుకుంటున్నట్టు విచారణలో తేలిదంటూ ప్రచారం జరుగుతోన్న ఆయన మాట్లాడానికి ఇష్టపడటం లేదు. దీంతో సంచలనంగా మారిన డ్రగ్స్ కేసులో ఇప్పుడు ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.

Spread the love
error: Content is protected !!