Recent Posts

ఆర్యన్‌ ఖాన్‌ బెయిలు పిటీషన్ ను తిరస్కరించిన కోర్టు

అమరావతి: మాదక ద్రవ్యాల కేసులో హీరో షారూక్‌ ఖాన్ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ బెయిలు కోసం పెట్టుకున్న దరఖాస్తును ముంబై స్పెషల్ కోర్టు బుధవారంనాడు తోసిపుచ్చింది..రేపటి వరకూ ఆర్యన్‌ను జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చింది.ఆర్యన్‌తో పాటు అర్బాజ్ మర్చెంట్, మున్‌మున్ ధమేఛా బెయిల్ దరఖాస్తులను కూడా కోర్టు నిరాకరించింది.నేటి విచారణలో భాగంగా NCB పలు ఆధారాలు కోర్టుకు సమర్పించింది.ఓ నటితో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ గురించి చాటింగ్ చేసినట్లు దర్యాప్తులో కనుగొన్నమని తెలిపింది.అలాగే డ్రగ్స్ వెండర్స్ తో ఖాన్ చాటింగ్ చేసినట్లు,అందుకు సంబంధించి వాట్సాప్ చాట్ లను కోర్టు ముందు వుంచింది.డ్రగ్స్ విక్రేతలకు అతను రెగ్యూలర్ కస్టమర్ అని తమ దర్యప్తులో వెల్లడైయిందని పేర్కొంది..అక్టోబర్ 2న ఆర్యన్, అర్బాజ్‌ సహా ఏడుగురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆర్యన్ ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్నాడు.

Spread the love
error: Content is protected !!