Recent Posts

ఆర్యన్ ఖాన్ ఈ నెల 7వ తేది వరకు NCB కస్టడీకి అనుమతించిన కోర్టు

అమరావతి: డ్రగ్స్ కేసులో దొరికిపోయిన షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తోంది..డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది..9 రోజుల కస్టడీని NCB (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) కోరినప్పటికీ మూడు రోజుల కస్టడీకి కోర్టు అంగీకరించింది..ఆర్యన్ ఖాన్‌తో పాటు ఇదే కేసులో అరెస్ట్ అయిన అర్బాజ్ సేత్, మర్చంట్, మున్మున్ దమేచాలను అక్టోబర్ 7 వరకు ఎన్‌సీబీ కస్టడీకి పంపించారు. మరోసారి కోర్టును ఆర్యన్ ఖాన్ కస్టడీని కోరనుంది NCB (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో).ఈ కేసుతో సంబంధం ఉందని అనుమానిస్తున్న శ్రేయస్ నాయర్ అనే వ్యక్తిని NCB అదుపులోకి తీసుకుంది..ఆర్యన్ ఖాన్, అర్బాజ్ లకు డ్రగ్స్ సప్లయ్ చేసింది శ్రేయస్ నాయర్ అని NCB గుర్తించింది..వారి మధ్య జరిగిన చాటింగ్ ఆధారంగా శ్రేయస్ నాయర్ పాత్ర వెలుగులోకి వచ్చింది. ఈ ముగ్గురికి పార్టీల్లో పరిచయం ఏర్పడిందని,, ఈ ముగ్గూరు కలిసి గతంలో అనేక పార్టీలు చేసుకున్నారని NCB దర్యాఫ్తులో తేలింది.మరోవైపు క్రూయిజ్ షిప్ లో NCB అధికారులు మరోసారి సోదాలు నిర్వహించారు.తాజా సోదాల్లో మళ్లీ డ్రగ్స్ లభ్యమయ్యాయి.మరో 8మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఆర్యన్ డ్రగ్స్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నాడు? ఎవరు సరఫరా చేస్తున్నారు అనే విషయాలపై పూర్తిగా దృష్టి పెట్టి కొంత సమాచారం తెలుసుకుంది.నాలుగు సంవత్సరాలుగా డ్రగ్స్ తీసుకుంటున్నా:-NCB విచారణ సమయంలో నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆర్యన్ NCB కి చెప్పినట్లు తెలుస్తోంది. యూకే, దుబాయ్ సహా ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ తీసుకునే వాడని,,విచారణ సమయంలో ఆర్యన్ ఖాన్ ఏడుస్తూనే ఉన్నాడని అధికారులు చెబుతున్నారు..ఆర్య‌న్‌పై సెక్ష‌న్ 27 (నార్కోటిక్ డ్ర‌గ్ వినియోగించినందుకు శిక్ష‌), 8సీ (డ్ర‌గ్స్ త‌యారీ, ఉత్ప‌త్తి, క‌లిగి ఉండ‌టం, అమ్మ‌డం లేదా కొన‌డం)తోపాటు ఇత‌ర నార్కోటిక్స్ డ్ర‌గ్స్ అండ్ సైకోట్రాపిక్ స‌బ్‌స్టాన్సెస్ చ‌ట్టంలోని సంబంధిత సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు.

Spread the love