Recent Posts

జెడ్పిటిసి, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాతంగా ముగిసింది-కలెక్టర్

25న ZP చైర్మన్..వైస్ ఛైర్మన్..

నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జెడ్పిటిసి, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం తిక్కన ప్రాంగణంలో ఎన్నికల పరిశీలకులు బసంత్ కుమార్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటుచేసిన 10 కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్ సాయంత్రం ఐదు గంటలకు పూర్తయిందన్నారు. ఎన్నికలు నిర్వహించిన 362 ఎంపీటీసి, 34 జెడ్పిటిసి స్థానాల్లో గెలుపొందిన విజేతలకు ధ్రువీకరణ పత్రాలను రిటర్నింగ్ అధికారులు అందజేసినట్లు చెప్పారు. ఈ నెల 24 న మండలాద్యక్షులు,మండల ఉపాధ్యక్షులు, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక, ఈ నెల 25 న ZP చైర్మన్..వైస్ ఛైర్మన్..కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి వివరాలు: జిల్లాలో మొత్తం 46 జడ్పిటిసి స్థానాల్లో 12 ఏకగ్రీవం కాగా 34 జడ్పిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా 34 స్థానాలనూ వైసిపి కైవసం చేసుకుంది.అలాగే జిల్లాలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 554 లో 188 ఏకగ్రీవం కాగా 362 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 362 ఎంపీటీసీ స్థానాల్లో వైసిపి 312, టిడిపి 31, బిజెపి 02, జనసేన 01, సిపిఐ (ఎం) 03, ఇండిపెండెంట్లు 13 స్థానాల్లో విజయం సాధించారు.

Spread the love