Recent Posts

కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రస్తుతం తొలి దశ‌లో ఉంది- ప్రపంచ ఆరోగ్య సంస్థ

అమరావతి: ప్రపంచ‌వ్యాప్తంగా కరోనా థర్డ్‌ వేవ్‌ అప్పుడే మొదలైపోయిందని,ఇది ప్రస్తుతం తొలి దశ‌లో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అథ‌న‌మ్ గేబ్రియాసిస్ హెచ్చరించారు..అయన మీడియాతో మాట్లాడుతూ దుర‌దృష్టవ‌శాత్తు మ‌నం క‌రోనా థర్డ్ వేవ్ ఆరంభ ద‌శ‌లో ఉన్నామని, మహమ్మారి నిరంత‌రం మారుతోంద‌ని,మ‌రింత ప్రమాద‌క‌ర వేరియంట్లు ఉద్భవిస్తున్నాయ‌ని తెలిపారు.. ప్రస్తుతం డెల్టా వేరియంట్ వైర‌స్ 111 దేశాల్లో న‌మోదు అయినదని, ప్రపంచ‌వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ స్ట్రెయిన్ వ్యాప్తిచే అవకాశాలు ఉన్నాయన్నారు.. ప్రపంచవ్యాప్తంగా గత నాలుగు వారాలుగా కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని,,10 వారాల స్థిరమైన క్షీణత తర్వాత మరణాలు కూడా మళ్లీ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.. ఓవైపు వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్న, కొత్త కేసులు, మృతుల సంఖ్య పెరుగుతూ పోతున్నాయన్నారు..ప్రస్తుతం  భారత్‌లో ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్‌ వేవ్‌ కేసులు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి… అయితే కొన్ని ప్రాంతాల్లో కొత్త కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి.. కొన్ని సంస్థల నివేదికల ప్రకారం ఆగస్టులో థర్డ్‌ వేవ్‌ ప్రారంభమై, సెప్టెంబర్‌లో పీక్‌కు వెళ్లే అవకాశాలున్నాయని హెచ్చరికలు వస్తువున్నాయి..

Spread the love