Recent Posts

దేశంలో కరోన సెకండ్‌ వేవ్‌ ఇంకా కొనసాగుతోంది-కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌

అమరావతి: ఉత్సవాలు, పర్వదిన వేడుకల్లో జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలు మసులకోవాలని కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ సూచించారు.గురువారం అయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో కరోనా పరిస్థితిని వివరిస్తు, గతవారంతో పోలిస్తే కేరళలో 68 శాతం కేసులు పెరిగాయని వెల్లడించారు.. దేశవ్యాప్తంగా 35 జిల్లాల్లో పాజిటివ్‌ రేట్‌ ఎక్కువగా ఉందని,, వరుస పండుగల వస్తున్న నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు పాటించాలని, ఉత్సవాలు,ఉరేగింపులు అంటూ గుమికూడొద్దని కోరారు..అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మళ్లీ కేసులు పెరుగుతాయని హెచ్చరించారు.కేరళలో కరోనా విజృంభణపై అయన ఆందోళన వ్యక్తం చేస్తు దేశంలో కరోన సెకండ్‌ వేవ్‌ ఇంకా కొనసాగుతోందని,ఇది ఇంకా ముగిసిపోలేదని ప్రకటించారు. దేశంలో 24 గంటల్లో 43,263 కొత్తగా కేసులు నమోదయ్యాయని, 338 మంది మృతి చెందారని తెలిపారు..ఇందులో ఒక్క కేరళలోనే 30,196 పాజిటివ్‌ కేసులు, 181 మృతులు సంభవించాయని పేర్కొన్నారు..

Spread the love