Recent Posts

కరోనా థర్డ్‌ వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు సన్నద్దంగా వుండాలి-సీ.ఎం జగన్

అమరావతి: సమర్ధ నిర్వహణ ద్వారా ఎక్కుమందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వగలిగామని సీ.ఎం వైయస్‌.జగన్‌ అన్నారు.మంగళవారం కోవిడ్‌–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం సమీక్షించారు.ఈ సందర్బంలో సీ.ఎం మాట్లాడుతూ రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్‌ డోసులు 1,80,82,390,,ఇంకా (బ్యాలెన్స్‌డు డోసులు) వినియోగించాల్సిన డోసులు 8,65,500,,ఇప్పటివరకు ఇచ్చిన డోసులు సంఖ్య 1,82,49,851
సమర్ధ నిర్వహణ ద్వారా దాదాపుగా 11 లక్షల డోసులు ఆదా చేశామన్నారు.ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులందరికీ 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిందని,విదేశాలకు వెళ్లే వారిలో ఇప్పటివరకు 31,796 మందికి వ్యాక్సినేషన్‌ చేయడం జరిగిందన్నారు.45 సంవత్సరాల దాటిన వారికి వ్యాక్సినేషన్‌ పూర్తయిన తర్వాత ప్రయారిటీగా ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టాలని అధికారులను అదేశించారు.థర్డ్‌ వేవ్‌ సన్నద్దత:- థర్డ్‌ వేవ్‌ వస్తుందన్న సమాచారం నేపధ్యంలో సన్నద్ధంగా ఉండాలని,విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్మించదలచిన పీడియాట్రిక్‌ సూపర్‌ కేర్‌ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలని సూచనలు చేశారు.పోలీస్‌ బెటాలియన్స్‌లో కూడా కోవిడ్‌ కేర్‌ ఎక్విప్‌మెంట్‌ ఏర్పాటుతో పాటు వైద్యులను నియమించడంతో పాటు కమ్యూనిటీ ఆస్పత్రులు స్ధాయివరకు ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.పీహెచ్‌సీల్లో కూడా ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచాలని,సబ్‌సెంటర్ల వరకు టెలీమెడిసిన్‌ సేవలు, ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందుబాటులో ఉంటే అప్పుడే వారితో పీహెచ్‌సీల వైద్యులు కూడా వీసీ ద్వారా అందుబాటులోకి వస్తారన్నారు.కోవిడ్‌ అంక్షల్లో భాగంగా మరో వారం రోజుల పాటు నైట్‌ కర్ఫ్యూ కొనసాగించాలని,రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ తప్పనిసరిగా  పాటించాలన్నారు..జనసమూహాలపై ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు..

Spread the love